Begin typing your search above and press return to search.
మధ్య నిషేధం సాధ్యంకాదా?
By: Tupaki Desk | 13 Sep 2022 5:17 AM GMTమద్యాన్ని నిషేధించాలని దాఖలైన పిటీషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ పిటీషన్ను విచారించడానికి కూడా అవకాశం లేదని సుప్రింకోర్టు స్పష్టంగా చెప్పింది. మద్యాన్ని నిషేధించాలని లేదా దేశవ్యాప్తంగా ఒక విధానం ఉండాలని దాఖలైన పిటీషన్ను కోర్టు కొట్టేసింది.
దీనిపై విచారణ కూడా అవసరం లేదని తేల్చి చెప్పేసింది. మద్య నిషేధం అన్నది రెవిన్యుతో ముడిపడిన అంశంగా సుప్రింకోర్టు స్పష్టంచేసింది. అన్నీ రాష్ట్రాలు మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా చూస్తున్నందున దీన్ని నిషేధం కూడా సాధ్యం కాదని న్యాయస్థానం అభిప్రాయపడింది.
మద్యం అమ్మకాలపై వచ్చే రెవిన్యుపైనే చాలా రాష్ట్రాలు ఆధారపడ్డాయన్న విషయాన్ని సుప్రీంకోర్టు పిటీషనర్ కు గుర్తుచేసింది. కాబట్టి ఈ అంశంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం తమకు లేదన్నది. మద్యం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితాలోనిదే అయినా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఒక విధానాన్ని రూపొందించుకుంటున్నందున కేంద్రం ఎక్కడా జోక్యం చేసుకోవటం లేదు.
మద్యం వల్ల తీవ్ర నష్టాలు జరుగుతున్నది వాస్తవమే అయినా దీని ద్వారా వచ్చే ఆదాయానికి ప్రత్యామ్నాయాలు లేవు కాబట్టి చాలా రాష్ట్రాలు దీనిపైన ఆధారపడినట్లు సుప్రింకోర్టు అభిప్రాయపడింది.
మద్యం ద్వారా వచ్చే ఆదాయానికి ప్రత్యామ్నాయాలు చూపకుండా వెంటనే మద్యాన్ని నిషేధించాలని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలను తాము ఆదేశించలేమని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. కోర్టులో జరిగిన విచారణను పక్కన పెట్టేస్తే ప్రస్తుతం గుజరాత్ లో మద్య నిషేధం అమలులో ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. మరి నిషేధం నూరుశాతం అమలవుతోందా ?
గుజరాత్ లో పేరుకు మాత్రమే నిషేధం అమల్లో ఉంది. కానీ యధేచ్చగా రాష్ట్రంలో ఎక్కడబడితే అక్కడ కావాల్సినంత మద్యం దొరుకుతోంది. గుజరాత్ పోలీసులు పట్టుకున్న కోట్లాది రూపాయల మద్యాన్ని రోడ్లపైన పెట్టి బుల్డోజర్లతో తొక్కిస్తున్న ఘటనలు రెగ్యులర్ గా చూస్తునే ఉన్నారందరు. మరి ఇంత భారీ ఎత్తున మద్యం రెగ్యులర్ గా పట్టుబడుతోందంటే ఇక నిషేధం ఎక్కడ అమలవుతున్నట్లు ? వ్యాపారులకు, బ్లాక్ మార్కెట్లో అమ్ముకునే వారికి ప్రతిరోజూ పండగనే చెప్పుకోవాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.