Begin typing your search above and press return to search.
వైసీపీలో మాజీ డిప్యూటీ సీఎం సీన్ రివర్స్ అయిపోయిందా...!
By: Tupaki Desk | 14 Dec 2022 4:21 AM GMTరాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలైనా ఎదురు కావొచ్చు. దీనికి నాయకులు రెడీగా ఉండాల్సిందే. తమకు వ్యతిరేకంగా.. ప్రజలు మారుతున్నారని..వారిపై అలిగితే.. ఎవరికి నష్టం? ఎవరికి కష్టం? ఇప్పుడు వైసీపీ నాయకుల వ్యవహారం కూడా ఇలానేఉంది. గత ఎన్నికలకు ముందు తిరుగులేని ఆదరణను పొంది న వారిలో చాలా మంది ఇప్పుడు వ్యతిరేక పవనాలు ఎదుర్కొంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో వీరికి పరిస్థితులు రివర్స్ అయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అందుకే ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తగ్గించి వారిని తమవైపు తిప్పుకొనేలా వ్యవహరించాలని సీఎం జగన్ చెబుతున్నారు.
గడపగ డపకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే.. ఎన్ని కార్యక్రమాలు చేసినా.. ప్రజల్లో కొందరి విషయలో నెలకొన్న అభిప్రాయాలు మాత్రం తొలిగిపోవడం లేదు. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
తాజాగా ఏలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ ఉరఫ్ నాని పరిస్థితి ఇబ్బం దిగా మారింది. గత ఎన్నికల సమయంలో తన నియోజకవర్గంలోని ప్రజలకు పట్టాలు ఇప్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీనిపై ప్రజలు ఆశలు పెట్టుకుని.. ఆయనకు ఓటెత్తారు. అయితే, ఈ విషయం ఇప్పటి వరకు ఒకదారికి రాలేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.
ఇటీవల ఆయన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కింద ప్రజల ఇళ్లకు తిరుగుతున్నారు. అయితే, ఇదే విషయంపై ప్రజలు ఆయనను నిలదీస్తున్నారు.
కొన్ని గ్రామాల్లోఅయితే.. తమ వాడకు రావొద్దని పేర్కొనడంతోపాటు.. ఘెరావ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది అయితే.. ఎమ్మెల్యేగా ఆళ్లపై ఎలాంటి మరకలు లేకపోవడం.. కేవలం చిన్న చిన్న విషయాలపైనే ఆయన అశ్రద్ధ చూపడం మినహా.. ఇక్కడ వ్యతిరేకత అయితే కనిపించడం లేదు. కానీ, ఈ చిన్న వ్యతిరేకతను కూడా ఆయన తప్పించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.