Begin typing your search above and press return to search.
ఆమంచి కృష్ణమోహన్ టీడీపీలోకి జంప్ నా?
By: Tupaki Desk | 2 March 2021 4:37 AM GMTకాపుల్లో ఆయన పేరున్న లీడర్.. కాపు సామాజికవర్గంలో కొంచెం దూకుడు స్వభావం ఉన్న నాయకుడు. 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా కూడా సత్తా చాటి గెలిచిన నేత.. రోశయ్య అనుంగ శిష్యుడు అయిన చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్.. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలోకి జంప్ అయ్యాడు. అయితే అప్పటివరకు ఉన్న వైసీపీ ఇన్ చార్జి అది జీర్ణించుకోలేకపోయాడని నియోజకవర్గంలో టాక్ ఉంది.
2019 ఎన్నికలకు ముందు ఆమంచి టీడీపీని వీడి వైసీపీలో చేరారు. వైసీపీ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కరణం బలరాం చేతిలో ఓడిపోయారు. కరణం బలరాంకు చీరాలలో పెద్ద బలం లేకపోయినా.. ఆమంచి కృష్ణ మోహన్ వ్యతిరేకులు అంతా కలిసి పంచేసి ఆమంచి కృష్ణ మోహన్ ను ఓడగొట్టారనే ప్రచారం ఉంది.. 2019 ఎన్నికల్లో టీడీపీ రాష్ట్రమంతా ఓడిపోయింది. వైసీపీ అఖండ మెజార్టీతో గెలిచింది. ఓడిపోయినా కూడా కృష్ణమోహన్ చీరాల వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. కానీ.. తర్వాత టీడీపీ ఎమ్మెల్యే కరణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు మద్దతు ఇచ్చారు. కుమారుడు వెంకటేష్‌ను పార్టీలో చేర్చారు. గతంలో టీడీపీలో ఉన్న కరణం, ఆమంచి ఇద్దరూ ఇప్పుడు అధికార వైసీపీలో చేరడంతో వీరి వైరం కారణంగా చీరాల రాజకీయం ఒక్కసారిగా మలుపులు తిరిగింది. ఫలితంగా పార్టీలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి.
ఒకే నియోజకవర్గంలో రెండు వర్గాలు ఏర్పడడంతో ఇక పార్టీ కార్యక్రమాలు పోటాపోటీగా జరుగుతున్నాయి. ఎవరికి వారుగా కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో ఒకటి రెండు దఫాల్లో ఘర్షణలు కూడా జరిగాయి. ఆ గొడవలను అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లారు. అధినేత జగన్‌కు ఫిర్యాదు చేశారు. అధిష్టానం రంగంలోకి దిగినా ఈ గ్రూప్ వార్‌కు చెక్ పెట్టాలేకపోతోంది.
ఇప్పుడు చీరాల వైసీపీ ఇన్ చార్జి అయిన ఆమంచి కృష్ణమోహన్ ను కరణం ఇబ్బంది పెడుతున్నాడనే టాక్ ఉంది. హైకమాండ్ కూడా ఇన్ డైరెక్టుగా కరణంకు సపోర్టు చేస్తోందని నియోజకవర్గంలో ప్రచారం సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమంచి కృష్ణమోహన్ ఈ ఆధిపత్య పోరుకు చెక్ పెట్టాలని ఏపీ సీఎం జగన్ ఎన్నిసార్లు కలిసినా వీరి పంచాయతీపై ఏమీ తేల్చలేకపోయాడు. పర్చూర్ ఇన్ చార్జిగా వెళ్లమని సీఎం జగన్ స్వయంగా ఆమంచికి సూచించాడని టాక్ ఉంది. ఎమ్మెల్సీ ఇచ్చి పర్చూర్ ఇన్ చార్జి ఇస్తామని చెబితే ఓకే అన్నాడట.. అయితే అదే సామాజికవర్గం నుంచి కడప జిల్లాకు చెందిన సి. రామంచంద్రయ్యకు ఎమ్మెల్సీ ఇచ్చి ఆమంచి కృష్ణ మోహన్ కు తాజాగా మొండి చేయి చూపెట్టారంట.. దీంతో ఆమంచి భవిష్యత్ గందరగోళంలో పడిపోయింది.
ఈ సమయంలోనే ఆమంచికి టీడీపీ నుంచి అనూహ్య ఆఫర్ వచ్చిందని సమాచారం. ‘‘గతంలో టీడీపీని బాగా తిట్టావని.. అయినా అది మేము పట్టించుకోమని.. నీకు మంచి ప్రాధాన్యత ఇస్తామని’’ టీడీపీ నుంచి ఆఫర్ ఇచ్చారని తెలిసింది. అయితే కార్యకర్తల నుంచి ఒత్తిడి వస్తోందని.. ఆమంచి స్వతంత్రంగానే ఉండాలా? వైసీపీలోనే ఉండాలా? రాజీనామా చేసి టీడీపీలోకి జంప్ అవ్వాలా? ఏమీ అర్థంకాకుండా ఉందని చీరాలో లోకల్ టాక్ నడుస్తోంది.
ఈ హోరు ప్రచారంలో ఆమంచి టీడీపీకిలోకి చేరుతారా? వైసీపీ హైకమాండ్ నుంచి ఏం స్పందన వస్తుందో లేదో అని కూడా చీరాలలో జోరుగా ప్రచారం సాగుతోంది.