Begin typing your search above and press return to search.

టీడీపీలో అనిత ఒంటరి అయ్యారా ?

By:  Tupaki Desk   |   23 July 2022 11:30 AM GMT
టీడీపీలో అనిత ఒంటరి అయ్యారా ?
X
రాజ‌కీయంలో ఎప్పుడూ ఒకే విధంగా ప‌రిణామాలు ఉండ‌వు. దానికి కారణం... వ్యక్తి ప్రయోజనాల కన్నా పార్టీ అధిష్టానాలు పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు మార్చుకుంటాయి. వ్యక్తులు తమ స్థాయిలో తాము ఎక్కడ కెరీర్ ఉంటే ఆ పార్టీకి వెళ్తుంటారు. ఇందులో ఎవ్వ‌రినీ తప్పు ప‌ట్ట‌లేం.

కొన్ని సార్లు కొన్ని అట్ట‌డుగు వ‌ర్గాలనే ల‌క్ష్యంగా చేసుకుని రాజ‌కీయం చేసి పైకి వ‌చ్చిన నేత‌లు ఆ త‌రువాత ఆయా సామాజిక‌వ‌ర్గాల‌ను మ‌రిచిపోయిన దాఖ‌లాలు అనేకం ఉన్నాయి. కొన్ని సార్లు అధి నాయ‌క‌త్వం ప్రోత్స‌హిస్తుంద‌న్న కార‌ణంతో ఇష్ట‌మొచ్చిన విధంగా ఎదుట పార్టీ వారిని తిట్టి త‌రువాత త‌ప్పులు దిద్దుకున్న వారూ ఉన్నారు.

ప్రస్తుతానికి అయితే మాజీ మంత్రి వంగ‌ల‌పూడి అనితపై బాబుపై ఈగ వాలనివ్వడం లేదు. తన స్థాయిలో తాను అధికార పక్షానికి భారీ కౌంటర్లు వేస్తుంటుంది. కానీ ఆమెపై జరుగుతున్న దాడికి మాత్రం పార్టీ నేతల నుంచి రియాక్షన్ కనిపించడం లేదు.గతంలో ఏ పార్టీలో అయినా ఒక‌రిని ఉద్దేశించి ఎవ్వ‌రైనా వ్యాఖ్య‌లు చేస్తే వెంట‌నే అంతా ఏక‌మై వాటిని ప్ర‌తిఘ‌టించేవారు. కానీ ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా పరిణామాలు ఉంటున్నాయి.

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి భార్య భార‌తిని ఉద్దేశించి కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు టీడీపీ రాష్ట్ర మ‌హిళాధ్య‌క్షురాలు వంగ‌ల‌పూడి అనిత. దీంతో వైసీపీ వెంట‌నే రంగంలోకి దిగి ఆమె వ్యాఖ్య‌లు ఖండించింది. ఇదే స‌మ‌యంలో అనిత‌ను అదే స్థాయి లో వైసీపీ మహిళా నేత ఒకరు అన‌రాని మాట‌లూ అన్న‌ది.

భార‌తిని ఉద్దేశిస్తూ వ్యాఖ్య‌లు చేసే క్ర‌మంలో అనిత అన్న మాట‌లు క‌న్నా వైసీపీ నాలుగు మాట‌లు ఎక్కువే అన్న‌ది. అది రాయ‌లేని భాష‌లో ఉంది. కానీ అనిత తరఫున కౌంటర్ పడలేదు. అనితకి ప్రొటెక్షన్ దొరకలేదు.

త‌గాదాలో టీడీపీ లీడ‌ర్లెలెవ్వ‌రూ త‌ల‌దూర్చ‌లేదు. వీలున్నంత వ‌ర‌కూ సైలెంట్ అయిపోయారు. దీంతో టీడీపీ తీరు పై కొన్ని విమ‌ర్శ‌లు ప‌రిశీల‌కుల నుంచి వివ‌వ‌స్తున్నాయి. అనిత‌ను టీడీపీలో ఇప్పుడు ఒంటరి చేశారా ? అన్న ప్ర‌శ్నకు స‌మాధానం వెతుక్కోవాలి. ఇది నేతల నిర్లక్ష్యమా? పార్టీ తప్పిదమా అన్నది అర్థం కావడం లేదు.