Begin typing your search above and press return to search.
శ్రీలంకలా ఏపీ, తెలంగాణ అప్పుల ఊబిలో జారుకోనున్నాయా?
By: Tupaki Desk | 20 July 2022 6:34 AM GMTదేశంలో ఆంధ్రప్రదేశ్ తో కలిపి పది రాష్ట్రాలు అప్పుల ఊబిలో చిక్కుకున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పొరుగు ద్వీప దేశం శ్రీలంక ఆర్థిక సంక్షోభంపై జూలై 19న ఢిల్లీలో అన్ని పార్టీలతో కేంద్రం సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ అప్పులపై కూడా చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ అప్పులు ప్రమాదకర పరిస్థితికి చేరాయని కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక శాఖ అధికారులు సమావేశంలో వివరించారని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ తో కలిపి మొత్తం పది రాష్ట్రాలు అప్పుల ఊబిలో ఉన్నాయని అధికారులు అఖిల పక్షానికి వివరించారని సమాచారం. ఈ సందర్భంగా శ్రీలంక తరహా పరిస్థితి కొన్ని రాష్ట్రాల్లో తలెత్తే అవకాశం ఉందని కేంద్రం ఆ రాష్ట్రాలకు ఘాటు హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది.
కాగా.. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికల నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకున్నారని టీడీపీ రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర అధికారులను ప్రశ్నించారు. ఆర్బీఐ, కాగ్ నివేదికల ప్రకారం అప్పులు ఎక్కువగా ఉన్న పది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి అని.. వీటికి కేంద్రం నుంచి ముందస్తు హెచ్చరికలు పంపినట్లు అధికారులు సమాధానం చెప్పారని సమాచారం. కాగా ఆంధ్రప్రదేశ్ జీడీపీలో 32 శాతం అప్పులు ఉన్నాయని ఆర్బీఐ, కాగ్ లు కేంద్రానికి నివేదించాయని వార్తా కథనాలు తెలుపుతున్నాయి.
వీటిలో బడ్జెటేతర అప్పులు, కమిటెడ్ ఎక్స్‌పెండీచర్, విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్)కు బకాయిలు, స్థాయికి మించిన ప్రభుత్వ హామీలు.. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్పగా మారడానికి కారణాలని కేంద్ర అధికారులు అఖిలపక్ష సమావేశంలో వివరించారు. వీటిని కేంద్ర ఆర్ధిక శాఖ ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని.. తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారని వెల్లడించారు.
ఇక తెలంగాణ అప్పుల ప్రస్తావన రాగానే టీఆర్ఎస్ ఎంపీలు అధికారులకు అడ్డు తగిలారని అంటున్నారు. తమ రాష్ట్రం నిబంధనల ప్రకారమే అప్పులు తీసుకుంటుందని టీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వ అధికారులతో వాదనకు దిగారని తెలుస్తోంది. శ్రీలంక సంక్షోభంతో పోల్చుతూ తమ రాష్ట్రాన్ని ఒకే గాటన కట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అలాగే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అప్పుల సంగతి ఏమిటని టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ ఎంపీలు నిలదీసినట్టు వార్తలు వచ్చాయి.
రాష్ట్రాల సంగతి ఎందుకు.. ముందు దేశ అప్పుల సంగతి చెప్పండి అని వైఎస్సార్సీపీ కేంద్ర అధికారులను ప్రశ్నించారని చెబుతున్నారు. శ్రీలంక సంక్షోభానికి.. రాజకీయ అస్థిరత, ఆర్ధిక సంక్షోభం, తలకు మించి చేసిన అప్పులు, విదేశీ మారక నిల్వలు తగ్గిపోవడం అని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. జాగ్రత్తలు తీసుకోకపోతే శ్రీలంకకు పట్టిన గతే ఈ పది రాష్ట్రాలకు పడుతుందని హెచ్చరించినట్టు మీడియా సంస్థలు పేర్కొన్నాయి.
కాగా తెలంగాణ మొత్తం 4.5 లక్షల కోట్ల అప్పులు, ఆంధ్రప్రదేశ్ రూ.4 లక్షల కోట్ల అప్పులు చేశాయని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అజయ్ సేథ్ చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అధికంగా అప్పులు చేసిన రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, కేరళ తదితర రాష్ట్రాలు ఉన్నాయని సమాచారం.