Begin typing your search above and press return to search.
ఏపీ అసెంబ్లీ కొత్త స్పీకర్ గా కోనా రఘుపతి . దాదాపు ఖరారు
By: Tupaki Desk | 28 May 2019 2:07 PM GMTసూపర్ మెజార్టీతో పవర్ లోకి వచ్చారు వైఎస్ జగన్.. అనూహ్యాంగా 150 పైగా సీట్లు సాధించడంతో ప్రభుత్వంలో మంత్రులుగా ఛాన్స్ కొట్టాయాలనే ఆశించే వారి సంఖ్య కూడా భారీగానే కనిపిస్తోంది.. అటు సీనియర్లు ఇటు జూనియర్లు ఇద్దరూ భారీ సంఖ్యలో గెలవడంతో మంత్రివర్గ కూర్పు జగన్ కు అంత ఈజీ కాదనే వాదన బలంగా వినిపిస్తోంది.. అందులో భాగంగానే సీఎంగా ఒక్కడినే ప్రమాణ స్వీకారం చేస్తానని జగన్ ప్రకటించారంటున్నారు.. ఫలితాలు వచ్చి ప్రమాణ స్వీకారానికి వారం రోజుల వ్యవధి ఉన్నప్పటికీ మంత్రి వర్గ కూర్పు కొంచెం కష్టం తో కూడుకున్నది కావడంతో కొంత సమయం తీసుకొని విస్తరణ చేయాలని జగన్ నిర్ణయించారట...
అయితే సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించడానికి అసెంబ్లీలో ప్రోటెం స్పీకర్ ను నియమిస్తారు.. సీనియర్ శాసనసభ్యుణ్ని ప్రోటెం స్పీకర్ గా నియమిస్తారు.. కానీ స్పీకర్ గా వైసీపీ ఎమ్మెల్యేనే ఎన్నుకుంటారు.. ఆ క్రమంలో చాలా పేర్లు ప్రచారంలో వచ్చాయి.. చిత్తూరు జిల్లా నగరి నుంచి గెలిచిన సినీ నటి ఆర్ కె రోజా, మాజీ మంత్రి నెల్లూరు జిల్లా నుంచి గెలుపొందిన ఆనం రామనారయణ రెడ్డి పేర్లు ప్రముఖంగా వచ్చాయి... అయితే బాపట్ల నుంచి గెలుపొందిన సీనియర్ ఎమ్మెల్యే కోన రఘుపతి పేరు స్పీకర్ పదవి కి ఖరారైందని ప్రచారం జరుగుతోంది..
ఉన్నత విద్యా వంతుడు కావడం , ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలుపొందడం, సౌమ్యుడిగా గుర్తింపు తో పాటు అసెంబ్లీ వ్యవహారాలపై పరిజ్ఞానం నేపథ్యంలో కోన రఘుపతి వైపు మొగ్గు చూపించబోతున్నారని.. ఇప్పటికే జగన్ ఓ నిర్ణయానికొచ్చారని తెలుస్తోంది.. బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన కోన రఘుపతి కి స్పీకర్ గా అవకాశం కల్పించి.. ప్రకాశం జిల్లా నుంచి మరోకరికి మంత్రి వర్గంలో అవకాశం కల్పించాలని జగన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది... స్పీకర్ పై క్లారిటీ వచ్చింది కాబట్టి డిప్యూటీ స్పీకర్ గా ఎస్సీ లేదా ఎస్టీ సామాజికవర్గానికి ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.. అందులోనూ మహిళను ఎంపిక చేయాలని యోచిస్తున్నట్లు గా సమాచారం.. కోన రఘుపతి మాజీ గవర్నర్ , కాంగ్రెస్ సీనియర్ నేత కోన ప్రభాకర్ రావు కుమారుడు కావడం విశేషం.