Begin typing your search above and press return to search.

ఎంఐఎంకు యూపీలో అంత బలముందా?

By:  Tupaki Desk   |   27 July 2021 6:56 AM GMT
ఎంఐఎంకు యూపీలో అంత బలముందా?
X
తెలంగాణలో సత్తా చాటింది. ముస్లిం ఓట్లు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో ఎమ్మెల్యే సీట్లను కైవసం చేసుకుంది. మహారాష్ట్రలో ఏకంగా నాలుగైదు సీట్లను చేజిక్కించుకుంది. బెంగాల్, బీహార్, మధ్యప్రదేశ్ ఇలా అన్ని చోట్ల ఎంఐఎం పాగా వేయగలిగింది. ఇప్పుడు వచ్చే ఏడాది మొదట్లో జరిగే యూపీ ఎన్నికలకు ఎంఐఎం పార్టీ సిద్ధమైంది. మరి అక్కడ కూడా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ తొడగొడుతున్నారు. ఏకంగా యూపీ బీజేపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ ను చిత్తుగా ఓడిస్తానని సవాల్ చేస్తున్నారు. ఎంఐఎంకు అంత ధైర్యం ఎందుకొచ్చింది.? అసలు యూపీలో ఎంఐఎం బలం ఎంతనేది ఆసక్తిగా మారింది.

నిజానికి యూపీలో ప్రస్తుతం బీజేపీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. అక్కడ ఎన్నికల్లో యూపీ సీఎం యోగి పాలన వల్ల వ్యతిరేకత వచ్చింది. కరోనా లాక్ డౌన్, వ్యవసాయ చట్టాలతో యోగికి ఈసారి గెలవడం కష్టమంటున్నారు.ఈ క్రమంలోనే యూపీలో ప్రధాన ప్రతిపక్షాలైన సమాజ్ వాది పార్టీ (ఎస్పీ), బహుజన్ సమాజ్ వాది పార్టీ(బీఎస్పీ)లు పొత్తు పెట్టుకొని బలంగా తయారయ్యారు.

ఈ క్రమంలోనే యూపీలో పెద్ద ఎత్తున ఉన్న ముస్లిం ఓట్లను చీల్చేందుకు ఎంఐఎం రెడీ కావడం.. ఎస్పీ, బీఎస్పీని కలవరపెడుతోంది. ఎస్పీ నేతలతో పొత్తు చర్చలు జరిపిన ఎంఐఎం నేతలు ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవినే బేరానికి పెట్టడం చూసి విస్తుపోతున్నారు.

రాబోయే ఎన్నికల్లో ఎస్పీ కూటమి అధికారంలోకి వస్తే ఎంఐఎంకు డిప్యూటీ సీఎం పోస్టు కావాలని అడుగుతున్నారు. ఎంఐఎంకు యూపీలో అంత సీన్ లేదని.. అలివి కానీ హామీలు అడుగుతోందని ఎస్పీ భావిస్తోంది. ఎంఐఎంను అసలు లెక్కలోకి తీసుకోవద్దని భావిస్తున్నారు.

ఎంఐఎంను దేశవ్యాప్తంగా విస్తరించాలని అసదుద్దీన్ ఓవైసీ డిసైడ్ అయ్యారు. యూపీలోనూ గట్టి అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్, బీహార్, బెంగాళ్, తమిళనాడులో ఎంఐఎం పార్టీ పోటీచేసి సత్తా చాటింది. ఇతర పార్టీలకు ముస్లిం ఓట్లు వెళ్లకుండా ఎంఐఎం దెబ్బతీస్తోంది.

యూపీలో ఇప్పటికే రెండు సార్లు పర్యటించి కాక రేపారు అసుదుద్దీన్ ఓవైసీ. తాము పోటీచేయాలని అనుకున్న నియోజకవర్గాలన్నీ ముస్లిం ప్రాబల్యమున్నవే కావడం గమనార్హం. దశాబ్ధాలుగా ఎస్పీ కూడా యాదవ్+ముస్లిం ఓట్లపైనే ఆధారపడి గెలుస్తోంది. ఇప్పుడు ఎస్పీతో పొత్తు పెట్టుకుంటే ఆ ఓట్ల చీలవు. లేదంటే చీలి ఎస్పీకి నష్టం కలుగుతుంది. ఈ విషయాన్ని గ్రహించిన ఎస్పీ నేతలు ఎంఐఎంతో పొత్తుకు అంగీకరించారు.

అయితే డిప్యూటీ సీఎం పోస్టును డిమాండ్ చేస్తున్న ఎంఐఎం డిమాండ్ కు ఆశ్చర్యపోతున్నారట.. త్వరలోనే యూపీకి అసద్ వెళ్లి అఖిలేష్ తో భేటి అవుతారు. అప్పుడే దీనిపై క్లారిటీ రానుందని సమాచారం.