Begin typing your search above and press return to search.

ఆత్మ‌కూరు ఉప పోరు హాట్ హాటేనా? రీజ‌న్ ఇదే!

By:  Tupaki Desk   |   23 April 2022 9:48 AM
ఆత్మ‌కూరు ఉప పోరు హాట్ హాటేనా?  రీజ‌న్ ఇదే!
X
ఉమ్మ‌డి నెల్లూరు ఆత్మ‌కూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి త్వ‌ర‌లోనే ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఇక్క‌డ నుంచి వ‌రుస విజ‌యాలు సాధించిన మేక‌పాగి రాజ‌మోహ‌న్‌రెడ్డి కుమారుడు మేక‌పాటి గౌతంరెడ్డి జ‌గ‌న్ కేబినెట్‌లో మంత్రిగా కూడా ప‌నిచేశారు.

అయితే..ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ఆయ‌న హ‌ఠాన్మ‌ర‌ణానికి గురైన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు త్వ‌ర‌లోనే ఇక్క‌డ ఉప ఎన్నిక‌కు రంగం రెడీ అవుతోంది. అయితే.. వాస్త‌వానికి ఇలాంటి సంద‌ర్భాల్లో చ‌నిపోయిన ప్ర‌జాప్ర‌తినిధి స్థానంలో ఆయ‌న కుటుంబానికే ప్రాధాన్యం ఇస్తారు.

అలాగే.. ఇప్పుడు మేక‌పాటి కుటుంబానికి ఇక్క‌డ ఎవ‌రు పోటీ చేస్తార‌నే విష‌యాన్ని వైసీపీ వ‌దిలిపెట్టింది. ఈ నేప‌థ్యంలో ఆది నుంచి గౌతంరెడ్డి స‌తీమ‌ణి శ్రీకీర్తి పోటీచేస్తార‌ని అనుకున్నా.. వ్యాపార ప‌రంగా.. ఆమె బాధ్య‌త‌లు చేప‌ట్టాల‌ని అనుకున్న‌ట్టు కుటుంబం తెలిపింది.

ఈ నేప‌థ్యంలో గౌతంరెడ్డి సోద‌రుడు విక్ర‌మ్ రెడ్డిని బ‌రిలో నిల‌పాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీంతో త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న ఉప పోరులో.. ఇక్క‌డ నుంచి విక్ర‌మ్‌రెడ్డికి వైసీపీ బీఫాం ఇవ్వ‌నుంది. అయితే.. ఎక్క‌డ ఎలాంటి ఎన్నిక వ‌చ్చినా.. మేమున్నామంటూ.. బీజేపీ బ‌రిలో నిలుస్తున్న విష‌యం తెలిసిందే.

గ‌తంలో తిరుపతి ఉప ఎన్నిక‌(బ‌ల్లి దుర్గాప్ర‌సాద్ మ‌ర‌ణంతో వ‌చ్చింది). త‌ర్వాత‌.. బ‌ద్వేల్‌(వెంక‌ట సుబ్బ య్య మ‌ర‌ణంతో వ‌చ్చిన ఉప పోరు) ఉప ఎన్నిక‌లోనూ.. బీజేపీ పోటీచేసింది. అయితే.. ఘోర ప‌రాజ‌యం పాలైంద‌నుకోండి. ఇక‌, ఇప్పుడు కూడా.. బీజేపీ ఆత్మ‌కూరు నుంచి బ‌రిలో నిల‌వాల‌ని నిర్ణ‌యించింది. ఈ విష‌యాన్నిబీజేపీరాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు స్వ‌యంగా ప్ర‌క‌టించారు. కుటుంబ రాజ‌కీయాల‌కు తాము వ్య‌తిరేక‌మ‌ని. కాబ‌ట్టి.. పోటీ చేస్తామ‌ని అన్నారు. వాస్త‌వానికి ఇలాంటి సంద‌ర్భాల్లో.. ఇత‌ర పార్టీలు పోటీకి దూరంగా ఉంటాయి.

కానీ, బీజేపీ స్ట‌యిలే వేరు క‌దా. ఈ నేప‌థ్యంలో మేక‌పాటి కుటుంబానికే చెందిన బిజివేముల ర‌వీంద్రారెడ్డి ఇక్క‌డ నుంచి పోటీకి సై అన్నారు. ఈయ‌న గౌతం రెడ్డి మ‌ర‌ణించిన రెండో వారంలోనే త‌న అనుచ‌రుల‌తో భేటీ అయి.. ఉప పోరులో పోటీకి సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. ఇక‌, బీజేపీ ఎలానూ పోటీకి దిగుతున్న నేప‌థ్యంలో బిజివేముల‌కు ఛాన్స్ ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. అయితే.. ఇలాంటి సంద‌ర్భాల్లో పోటీకి దూరంగా ఉండే.. టీడీపీ, జ‌న‌సేన‌లు ఎలా వ్య‌వ‌హ‌రిస్తాయో చూడాలి.

గ‌తంలో బ‌ద్వేల్ ఉప పోరు జ‌రిగిన‌ప్పుడు.. ప్ర‌త్య‌క్షంగా ఈ రెండు పార్టీలు పోటీకి దూరంగా ఉన్నా.. బ‌రిలో ఉన్న బీజేపీకి.. ప‌రోక్ష సాయం చేశాయ‌నే టాక్ ఉంది. ఎలా చూసుకున్నా.. ఆత్మ‌కూరు ఉప పోరువైసీపీకి ఏక‌ప‌క్షం అయితే.. అయ్యేలా లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.