Begin typing your search above and press return to search.
వైసీపీ మాజీ మంత్రి పార్టీ మారాల్సిందేనా...?
By: Tupaki Desk | 11 Dec 2022 4:30 PM GMTఆయన చిరకాల కోరిక మంత్రి పదవి చేపట్టడం. దాన్ని ఆయన వైసీపీలో చేరి నెరవేర్చుకున్నారు. మూడేళ్ల పాటు ఆయన మినిస్టర్ హోదాను అనుభవించారు. అయితే ఆరు నెలల క్రితం మంత్రివర్గ విస్తరణలో ఆయన పదవి పోయి మాజీ అయ్యారు. ఆయనే విశాఖ జిల్లాకు చెందిన అవంతి శ్రీనివాసరావు. ఆయనకు అప్పట్లో విశాఖ జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించారు.
కానీ రీసెంట్ గా ఆ పదవి కూడా పోయింది.ఆయన జస్ట్ భీమిలీ ఎమ్మెల్యే మాత్రమే. పార్టీలో ఆయన ప్రాధాన్యత అమాంతం తగ్గిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు. అదేంటి అంటే ఆయనకు వైసీపీ అధినాయకత్వం నియమించిన పార్టీ పెద్దలతో మంచి రిలేషన్స్ లేవు అంటారు. ఆయన వారితో సాన్నిహిత్యంగా ఉండడంలేదు అని అంటారు. గతంలో విశాఖ వైసీపీ వ్యవహారాలను విజయసాయిరెడ్డి చూసేవారు.
ఆయనతోనూ అవంతికి పడేది కాదని చెప్పేవారు. తనను మంత్రిగా స్వేచ్చగా పనిచేసుకోనీయకుండా ఎంపీ వ్యవహరించేవారు అని అవంతి నాడు హర్ట్ అయిన సందర్భాలు ఉన్నాయని చెబుతారు. ఆయన తరువాత వచ్చిన వైవీ సుబ్బారెడ్డితోనూ అంతంతమాత్రమైన రిలేషన్స్ నే మెయింటెయిన్ చేస్తున్నారు అని అంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆయన పేరిట అంటూ ప్రచారం జరిగిన ఆడియో క్లిప్స్ అందులో అనుచిత వ్యాఖ్యలు ఉన్నాయని విపక్షాల విమర్శల నేపధ్యంలో కూడా మాజీ మంత్రిని అధినాయకత్వం దూరం పెట్టినట్లుగా చెబుతున్నారు.
ఇంకో వైపు చూస్తే భీమిలీలో టీడీపీ పట్టు పెరిగింది. ఆ పార్టీకి కంచుకోట లాంటి సీటు అది. దాంతో చేసిన సర్వేలలో సైతం అవంతికి వ్యతిరేకంగా నివేదికలు రావడంతో ఆయనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వబోరు అని ప్రచారం గట్టిగా సాగుతోంది. భీమిలీలో ఈసారి కొత్త ముఖానికే చాన్స్ ఉంటుందని అంటున్నారు.
మరి ఈ నేపధ్యం నుంచి చూస్తే మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు రాజకీయ భవిష్యత్తు ఇబ్బందుల్లో పడింది అనే అంటున్నారు. ఆయనకు టికెట్ దక్కదు అని సొంత పార్టీలోనే గుసగుసలు పోతున్నారు. ఆయన ప్రాధాన్యత కూడా తగ్గిపోయింది అని అంటున్నారు. మరి అవంతి రెండు దశాబ్దాల రాజకీయ జీవితాన్ని చూశారు. ఆయన రెండు సార్లు ఎమ్మెల్యే, ఒక సారి ఎంపీగా పనిచేశారు. మంత్రిగా కూడా చేశారు.
వైసీపీ కనుక ఆయనకు టికెట్ లేదు అని చెబితే ఆయన ఏం చేస్తారు అన్నది కూడా చర్చనీయాంశంగా ఉంది. ఇప్పటికే ప్రజారాజ్యం, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ పార్టీలు చూసిన అవంతి తన రాజకీయ భవిష్యత్తు కోసం మరో మారు పార్టీ మరే చాన్స్ ఉందంటూ ప్రచారం అయితే గట్టిగా సాగుతోంది. వైసీపీ హై కమాండ్ ఆయన విషయంలో ఏదో ఒకటి తేల్చేస్తే కనుక అవంతి తన ఫ్యూచర్ ప్లాన్స్ ని అమలులో పెడతారు అని అంటున్నారు. మొత్తానికి వైసీపీలో అవంతి రాజకీయం ఇలా వెలిగి అలా మలిగిపోయింది అనే అంతా అంటున్నారు. దానికి ఆయన స్వయంకృతం కూడా ఉందని సొంత పార్టీలోనే టాక్ ఉందిట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.