Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ కోసం బాబు ఈ ప‌నిచేస్తున్నారా?

By:  Tupaki Desk   |   18 Oct 2021 7:39 AM GMT
ప‌వ‌న్ కోసం బాబు ఈ ప‌నిచేస్తున్నారా?
X
ఔను.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కోసంటీడీపీ అధినేత చంద్ర‌బాబు త్యాగాలు చేస్తున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఓ వ‌ర్గం మీడియాలో ప‌వ‌న్‌ను ఆకాశానికి ఎత్తేయ‌డం ఎప్ప‌టినుంచో ఉన్నా.. ఇటీవ‌ల కాలంలో ఇది మ‌రింత ఎక్కువైంది. ఇదంతా చంద్ర‌బాబు సూచ‌న‌ల మేర‌కే జ‌రుగుతోంద‌ని అంటున్నారు. అంతే కాదు..ప‌వ‌న్ కోసం అంటూ.. చంద్ర‌బాబు మ‌రిన్నిత్యాగాలు చేస్తున్నార‌ని చెబుతున్నారు. కొన్ని నియోజ‌క‌ వర్గాల‌ను కూడా ప‌వ‌న్ కోసం ఇప్ప‌టి నుంచే వ‌ద‌లేస్తున్నార‌ని.. ఫైర్ బ్రాండ్ నేత‌ల‌ను కూడా అదుపు చేస్తున్నార‌ని.. గుస‌గుస వినిపిస్తోంది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావ‌డమే ల‌క్ష్యంగా చంద్ర‌బాబు అడుగులు వేస్తున్నారు. అయితే.. దీనికి సంబంధించి ఆయ‌న 2019 ఎన్నిక‌ల్లో జ‌రిగిన పొర‌పాట్ల‌ను స‌రిదిద్దుకునే ప‌ప్ర‌య‌త్నంలో ఉన్నారు. ముఖ్యంగా ఒంట‌రి పోరు టీడీపీకి ఎప్ప‌టికీ క‌లిసిరాద‌నే స‌త్యాన్ని గ్ర‌హించిన చంద్ర‌బాబు.. వ‌చ్చే ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రిగినా.. జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకుని ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిఇప్ప‌టికే ప‌వ‌న్‌- చంద్ర‌బాబుల మ‌ధ్య కొన్ని అవ‌గాహ‌న‌లు కూడా కుదిరాయ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో గుస‌గుస వినిపిస్తోంది.

ఇక‌, ప్ర‌క‌ట‌న ఒక్క‌టే త‌రువాయిగా ఉంద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో ప‌వ‌న్ వాయిస్ బ‌లంగా వినిపించేందుకు ఓవ‌ర్గం మీడియాను చంద్ర‌బాబు మేనేజ్ చేశార‌నే ప్ర‌ధాన వాద‌న‌.. అదేస‌మ‌యంలో త‌న కుమారుడు యువ నాయ‌కుడు లోకేష్ దూకుడును కూడా త‌గ్గించార‌ని అంటున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు జిల్లాల్లో ప‌ర్య‌టించిన లోకేష్‌.. దూకుడుగా వ్య‌వ‌హ‌రించారు. జ‌గ‌న్‌పైనా వైసీపీ నేత‌ల‌పైనా విమ‌ర్శ‌లు సంధించారు. అయితే.. కొన్ని రోజులుగా ఆయ‌న త‌న వాయిస్ త‌గ్గించారు. దీనికి ప‌వ‌న్‌ను హైలెట్ చేయ‌డం కోస‌మే ఇలా చేస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది.

అదేస‌మ‌యంలో విజ‌య‌వాడ వెస్ట్ స‌హా.. గుంటూరు తూర్పు, క‌ర్నూలులో నాలుగు నియోజ‌క‌వ‌ర్గాలు, అనంత‌పురంలో రెండు నియోజ‌క‌వ‌ర్గాలు.. ఇలా.. రాష్ట్రంలో 40 నియోజ‌క‌వ‌ర్గాల‌కు పైగా జ‌న‌సేన‌కు అప్ప‌గించే ఆలోచ‌న‌తో ఉన్న‌ట్టు చెబుతున్నారు. అందుకే ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇంచార్జ్‌ల‌ను కూడా నియ‌మించ‌లేద‌ని అంటున్నారు. మొత్తంగా చూస్తే.. జ‌న‌సేన‌కు 50 నియోజ‌క‌వ‌ర్గాల‌కు పైగానే అప్ప‌గించే ఆలోచ‌న చేస్తున్నార‌ని చెబుతున్నారు. మ‌రి ఈ త్యాగాల వెనుక పొత్తు రాజ‌కీయాలే ఉన్నాయ‌ని.. లేక‌పోతే.. ఎప్పుడో ఇంచార్జ్‌ల‌ను నియ‌మించేవార‌నే చ‌ర్చ జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.