Begin typing your search above and press return to search.
పొలిటికల్ సర్వేల వెనక బీజేపీ ఉందా...?
By: Tupaki Desk | 13 July 2022 3:30 PM GMTజాతీయ స్థాయిలో సర్వేలు అని ప్రతీ నెలకు ఒకసారి వస్తూంటాయి. వాళ్ళు ఏమి సర్వే చేస్తున్నారో తెలియదు కానీ నిన్న ఒక సర్వే వచ్చింది. దేశంలో సీఎంల లిస్ట్ చూస్తే జగన్ 20వ స్థానంలో ఉన్నాడని టీడీపీ మీడియా ఊదరగొడుతోంది. ఇక ఆ మధ్యన వచ్చిన సర్వేలల్లో జగన్ ముందు ఉన్నాడు కదా అవి ఎందుకు టీడీపీ అనుకూల మీడియా రాయదు అని వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఇక ఈ సర్వేలలో చూస్తే ప్రతీ నెలా సీఎం ల రేంజి మారిపొతోందట. గతంలో అన్ని సర్వేలు చూసినా తమిళనాడు సీఎం స్టాలిన్ మొదటి రెండు స్థానాల్లో ఉండేవారు.
అయితే ఇపుడు వచ్చిన సర్వేలలో ఆయన పేరు ఎక్కడా లేదు. కేసీయార్ కి 11వ ర్యాంక్ ఇచ్చారు. నవీన్ పట్నాయక్ ని ఫస్ట్ ప్లేస్ లో ఉంచి మిగిలిన వన్నీ కూడా బీజేపీ ముఖ్యమంత్రులకే ఇచ్చేశారు. అయితే ఇక్కడ ఆలోచన చేయాల్సింది ఒకటి ఉంది. అన్ని సర్వేలలో మోడీ గ్రాఫ్ మాత్రం బాగా పెరుగుతూ ఉంది. ఆయన 55 శాతం నుంచి అరవి శాతం వరకూ ప్రజల అనుకూల మద్దతు పొందుతున్నారు.
ఇదే చిత్రంగా ఉంటోంది మరి. అసలు బీజేపీకి కానీ మోడీకి కానీ దక్షిణ భారత దేశంలో ఒక్క కర్నాటక తప్పించి మిగిలినవి అన్నీ చూస్తే ప్రాంతీయ పార్టీల అధికారంలో ఉన్నాయి. కేరళలో అయితే కమ్యూనిస్టులు జాతీయ పార్టీగా ఉన్నారనుకోండి. మరి మోడీకి 59 శాతం ఎలా వస్తోంది అన్నదే ఇక్కడ చర్చగా ఉంది.
ఉదాహరణకు తీసుకుంటే ఏపీలో బీజేపీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. తమిళనాడులో చూస్తే బీజేపీకి అసలు సీన్ లేదు. తెలంగాణాలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉంటే మేమే అక్కడ గెలుస్తామని చెబుతూ వస్తున్నారు. అక్కడ చూసినా రఘునందన్ కానీ ఈటెల కానీ సొంత బలంతోనే వారి సీట్లను గెలిచారు. వాళ్ళు బీజేపీ ఓట్లతో గెలిచారా అంటే కాదనే చెప్పాలి.
మరో వైపు చూస్తే 2018లో తెలంగాణాలో శాసనసభ ఎన్నికలు జరిగితే 107 స్థానాలలో బీజేపీకి డిపాజిట్లు రాలేదు. ఇక ఏపీలో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. తమిళనాడు, కేరళలలో బీజేపీ వాళ్ళకు ఓట్లే లేవు. మరి మోడీకి సౌతిండియాలో 59 శాతం జనాల మద్దతు ఎలా వచ్చిందని ఆ సర్వేలు చెబుతున్నాయన్నదే ఇక్కడ పాయింట్. విషయం చూస్తూంటే దేశంలో మోడీకి సరిసాటి లేరు అని చెప్పడానికి ఈ తరహా సొంత పైత్యాలతో సర్వేలు వదులుతున్నారా అన్న సందేహాలు వస్తున్నాయి.
అలాగే సోషల్ మీడియాను ప్రభావితం చేయడం జనాలను మభ్యపెట్టడానికి ఈ తరహా ట్రిక్స్ ని అమలు చేయడం వంటిని చేస్తున్నార అన్న అనుమనాలూ పెరిగిపోతున్నాయి. నిజానికి ఏ సర్వే అయినా సహేతుకత ఎంతో కొంత ఉండాలి. అలాగే లాజిక్ కి అది అందాలి. ఫలనా చోట సర్వే చేశాం, ఫీడ్ బ్యాక్ మాకు అక్కడ ఇలా వచ్చింది అని చెప్పుకోవడానికైనా ఆధారాలు ఉండాలి కదా. కానీ చూడబోతే అవేమీ కనిపించడంలేదు అంటే ఆలోచించాల్సిందే.
అయినా ఈ రోజులలో సర్వేలను నమ్మే జనాలు ఉన్నారా అన్నది కూడా చూడాలి. ఎవరి కుంపటి వారిది అన్నట్లుగా ఎవరి డబ్బా వారిది అన్నట్లుగా ఎవరి సర్వే వాళ్లదిగా ఉంటోంది. అందువల్ల ఈ తరహా సర్వేలలో విశ్వసనీయత ఏ మాత్రం అన్న సూటి ప్రశ్నలు వస్తున్నాయి. ఇదే తీరున చేసుకుంటూ పోతే రేపటి రోజున నిజమైన సర్వేలు రిలీజ్ చేసినా జనాలు నమ్మే సీన్ అయితే కచ్చితంగా ఉండదు అంటున్నారు.