Begin typing your search above and press return to search.

బీజేపీది బ్లాక్ మెయిలింగ్ రాజకీయమేనా ?

By:  Tupaki Desk   |   16 Sep 2022 5:30 AM GMT
బీజేపీది బ్లాక్ మెయిలింగ్ రాజకీయమేనా ?
X
బీజేపీది బ్లాక్ మెయిలింగ్ రాజకీయంలాగే కనబడుతోంది. ఎంతసేపు ప్రత్యర్ధులను ఒత్తిడికి గురి చేయడం మీదే బీజేపీ నేతలు దృష్టి పెడుతున్నారు. ఇపుడిదంతా ఎందుకంటే బీజేపీ ఢిల్లీ ఎంఎల్ఏ మంజీందర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ నేతలకు సంబంధించిన వీడియో సాక్ష్యాధారాలున్నట్లు చెప్పారు. ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ నేతలకున్న లింకుల ఆధారాలన్నీ తమ దగ్గర ఉన్నట్లు చెప్పారు.

కొద్దిరోజుల క్రితం టీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక వ్యక్తుల పాత్రుందంటే బీజేపీ ఎంపీలు ఒకటే గోల చేశారు. ఆధారాలను బయటపెట్టమంటే సమయం వచ్చినపుడు అన్నీ బయటపెడతామని చెప్పారు. డైరెక్టుగా కేసీయార్ కూతురు కవితపై పాత్ర ఉందని ఆరోపణలు చేయటంతో ఆమె కోర్టులో కేసు వేశారు.

దాంతో ఆమె పేరును ప్రస్తావించద్దని కోర్టు ఆదేశించింది. దాంతో కొద్ది రోజులు కమలనాథులు ఏమీ మాట్లాడలేదు. మళ్ళీ ఇపుడు కొత్తగా టీఆర్ఎస్ ప్రముఖల లింకులకు వీడియో సాక్ష్యాలున్నట్లు గోల మొదలుపెట్టారు.

కోర్టు కూడా వీళ్ళని ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయద్దని మాత్రమే చెప్పింది. నిజంగానే టీఆర్ఎస్ ప్రముఖల పాత్రపై ఏవైనా ఆధారాలుంటే వాటిని మీడియా ద్వారా బయటపెట్టచ్చు. ఆధరాలు దగ్గర పెట్టుకుని మాట్లాడితే కోర్టు కూడా వీళ్ళని తప్పుపట్టే అవకాశం లేదు.

కానీ అలా చేయకుండా కేవలం మానసికంగా ఇబ్బంది పెట్టడమే టార్గెట్ గా ఆరోపణలు మాత్రమే చేస్తున్నారు. దాన్ని పట్టుకుని తెలంగాణాలో బీజేపీ నేతలు తెగ రెచ్చిపోతున్నారు.

ఇపుడు టీఆర్ఎస్ ప్రముఖులు హోటళ్ళల్లో మంతనాలు జరిపిన వీడియోలు తమదగ్గర ఉన్నట్లు చెబుతున్నారు. ఈ వీడియోలన్నింటినీ కోర్టులోనే అందిస్తారట. లిక్కర్ స్కాం ద్వారా సంపాదించిన డబ్బునే ఆప్ పార్టీ పంజాబ్, గోవా రాష్ట్రాల్లో ఖర్చుచేసిందని బీజేపీ నేతలు పదే పదే ఆరోపిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే లిక్కర్ స్కాంలో ఆధారాలు బయటపడ్డాయి కాబట్టి వెంటనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.