Begin typing your search above and press return to search.
ఆ వ్యూహంలో భాగంగానే ప్రగతిభవన్ పై బీజేపీ నిఘా?
By: Tupaki Desk | 3 April 2021 3:30 PM GMTతాము టార్గెట్ రాష్ట్రాల్లో అధికారాన్ని చేతపట్టే వరకు విడిచిపెట్టని అలవాటు బీజేపీకి ఉన్నదే. ఆ పార్టీ ఏదైనా రాష్ట్రాన్ని టార్గెట్ చేస్తే.. దాన్ని సొంతం చేసుకునే వరకు విడిచిపెట్టకుండా అదే పనిగా ప్రయత్నాలు చేయటమే కాదు.. మార్గం ఏదైనా సరే.. తుది ఫలితమే తమకు ముఖ్యమన్నట్లుగా మోడీషాల తీరు ఉంటుందని చెబుతారు. గతంలో బీజేపీ తీరుకు.. ప్రస్తుతానికి మార్పు భారీగా ఉందని చెబుతారు. తెలంగాణ మీద కన్నేసిన బీజేపీ.. తెలంగాణ అధికారపక్ష టీఆర్ఎస్ పవర్ సెంటర్ గా ఉన్న ప్రగతి భవన్ పై ప్రత్యేక నజర్ వేసినట్లుగా చెబుతున్నారు.
ప్రగతిభవన్ లో జరుగుతున్న కార్యకలాపాల పైనే కాదు.. ప్రగతిభవన్ కు వచ్చి వెళ్లే వారెవరు? లోపలేం జరుగుతోంది? ఫైళ్ల విషయంలో ఎలాంటి చర్చ జరుగుతుందన్న విషయం మీద ప్రత్యేకంగా నజర్ వేసినట్లుగా తెలుస్తోంది. టీఆర్ఎస్ ఆర్థిక మూలాల మీద బీజేపీ ప్రత్యేక శ్రద్ధను ప్రదర్శిస్తోంది. ఇటీవల ఫలితాలు వెల్లడైన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ కు ముందు రోజుటీఆర్ఎస్ పార్టీ నేతలు ఒక్కో అభ్యర్థి గెలుపు కోసం రూ.50 కోట్లు ఖర్చుపెట్టేందుకు వెనుకాడకపోవటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
దీంతో.. నిధుల వరదకు చెక్ చెబితే తప్పించి.. టీఆర్ఎస్ ను కంట్రోల్ చేయటం సాధ్యం కాదన్న ఆలోచనలో ఉన్న బీజేపీ అధినాయకత్వం అందుకు తగ్గట్లే ప్రయత్నాల్ని షురూ చేసినట్లు చెబుతున్నారు. ఇప్పటికే ప్రగతిభవన్ లో ఉండాల్సిన కీలక డాక్యుమెంట్ల నకళ్లు.. ఢిల్లీకి చేరాయని చెబుతున్నారు. 2019లో ఏపీలో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ఆర్థిక మూలాల్ని.. టీడీపీకి ఫండింగ్ చేసే వారిని వ్యూహాత్మకంగా చెక్ చెప్పటం.. చేతులు కట్టేయటం తెలిసిందే. నిజానికి.. ఎన్నికల గెలుపు మీద తీవ్ర ప్రభావాన్ని చూపించిందని చెప్పాలి.
సరిగ్గా ఇప్పుడు అలాంటి వ్యూహాన్నే పశ్చిమబెంగాల్ ఎన్నికల్లోనూ అమలు చేస్తున్నారు. పలు రాష్ట్రాల్లో సక్సెస్ అయిన ఈ ఫార్ములాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిమీద ఫోకస్ పెట్టినట్లు చెబుతున్నారు. ఇటీవల ప్రగతిభవన్ లో ఉన్నకీలక ఫైళ్లకు సంబంధించిన పత్రాలు పెద్ద ఎత్తు బయటకు వచ్చి.. బీజేపీ ముఖ్యనేతల చేతుల్లోకి వెళ్లాయని.. వాటిని వారు అధ్యయనం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ పరిణామాలు పెద్దసారుకు ఇబ్బందులకుగురి చేసేవన్న మాట వినిపిస్తోంది.