Begin typing your search above and press return to search.
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ లీజులో ఉందా?
By: Tupaki Desk | 3 Jan 2022 9:33 AM GMTదేశంలో అతి పెద్దపార్టీగా, కేంద్రంలోను, దాదాపు 20 రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉన్న పార్టీగా పేరున్న బీజేపీ.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు లీజుకు తీసుకున్నాయనే వ్యాఖ్యలు బలంగా వినిపిస్తున్నాయి. నిజానికి 2014 తర్వాత దేశంలో బీజేపీ అనూహ్యంగా బలపడుతున్న వైనం తెలిసింది. అనేక రాష్ట్రాల్లో పార్టీ వ్యూహాత్మకంగా వేసిన అడుగులు కలిసివచ్చాయి. దీంతో ఈశాన్య రాష్ట్రాల నుంచి దక్షిణాది రాష్ట్రాల వరకు కూడా ఈ పార్టీ పుంజుకుందనే చెప్పాలి.
కానీ, ఎంత పుంజుకుందామని అనుకున్నా రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణలో మాత్రం పార్టీ నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఉద్యమాలు చేస్తున్నా.. రోడ్డెక్కుతున్నా.. పాదయాత్రలు చేస్తున్నా.. బీజేపీని ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. నాయకుల మధ్య అంతర్గత కుమ్ములాటలు, వర్గ పోరాటం ఎక్కువగా కనిపిస్తోందని పార్టీలో పెద్ద ఎత్తున కలకలం రేగుతోంది. ఇటు ఏపీలోను, అటు తెలంగాణలోనూ.. ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పార్టీ చీఫ్ లు యాక్టివ్‌గా ఉన్నప్పటికీ. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది.
ఇదిలావుంటే, తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ ఎస్, ఏపీలో అధికార పార్టీ వైసీపీలు.. బీజేపీని లీజుకు తీసుకున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి కారణం.. బీజేపీకి ఈ రెండు రాష్ట్రాల్లోనూ పెద్దగా ఓటు బ్యాంకు లేకున్నా.. ఈ పార్టీ నేతలు చేస్తున్న కామెంట్లకు అధికార పార్టీ నేతలు సమాధానం చెబుతున్నా రు. వారి వ్యాఖ్యలకు కౌంటర్లు ఇస్తున్నారు. అంతేకాదు.. ఆ పార్టీ నేతలు చేపడుతున్న కార్యక్రమాలకు కూడా అనుమతులు ఇస్తున్నారు. ఇదంతా చూస్తే... బీజేపీకి , ఈ రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీలకు మధ్య లీజు ఏమైనా ఉందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణను తీసుకుంటే.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార టీఆర్ ఎస్‌కు గట్టి పోటీ ఉంటుందనే అంచనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీని బలోపేతం చేస్తే.. ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువ అవుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నే ఆ పార్టీని బలోపేతం కాకుండా చూసేందుకు.. అధికార పార్టీ నేతలే.. ఎక్కడికక్కడ కౌంటర్లు ఇస్తున్నారని అంటున్నారు. ఇలా చేయడం ద్వారా.. బీజేపీ ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నంలో ఉన్నారని.. అన్నీ తామై వ్యవహరిస్తున్నారని.. అంటున్నారు.
ఇక, ఏపీ విషయాన్ని పరిశీలించినా.. ఏపీలోనూ బీజేపీకి 1 శాతం ఓట్లు కూడా లేదు. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. పోటీ లేని చోట కూడా పార్టీ పుంజుకోలేక పోయింది. క్షేత్రస్థాయిలోనూ బలం లేకుండా పోయింది. అయినప్పటికీ.. బీజేపీ నేతలు చేస్తున్న కామెంట్లకు ఏపీ అధికార పార్టీ నేతలు రియాక్ట్ అవుతున్నారు. బీజేపీ నిర్వహిస్తున్న సభలకు కూడా వెంటనే అనుమతులు ఇస్తున్నారు. దీనిని బట్టి.. బీజేపీని వాళ్లకు లీజుకు ఇచ్చారా? అని రాజకీయ విశ్లేషకులు భావిస్తుండడం గమనార్హం. మరి దీనిపై బీజేపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.