Begin typing your search above and press return to search.

త‌మిళ‌నాడుపై బీజేపీ విభ‌జ‌నాస్త్రం.. నిజ‌మేనా?

By:  Tupaki Desk   |   7 July 2022 11:30 AM GMT
త‌మిళ‌నాడుపై బీజేపీ విభ‌జ‌నాస్త్రం.. నిజ‌మేనా?
X
ద‌క్షిణాది రాష్ట్రాల‌పై దృష్టి సారించిన బీజేపీ.. ఒక్కోరాష్ట్రంపై ఒక్కో విధంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌నే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆనుపానులు చూసుకుని.. ఆయా రాష్ట్రాల్లో అడుగులు వేసేందుకు.. క‌మ‌ల నాథులు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని స‌మాచారం. అంటే.. తెలంగాణ‌లో ఒక‌విధంగా ఏపీలో మ‌రో విధంగా.. ఇక‌, త‌మిళ‌నాడులో ఇంకో విధంగా.. ఇలా ద‌క్షిణాది రాష్ట్రాల‌పై బీజేపీ వ్యూహం డిఫ‌రెంట్‌గా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఏపీలో అయినా.. 2014లో న‌లుగురు ఎమ్మెల్యేలు.. ఇద్ద‌రు ఎంపీలు గెలిచారు.

ఇక‌, తెలంగాణ‌లోనూ అంతో ఇంతో ఫాలోయింగ్ ఉంది. కానీ, త‌మిళనాడులో బీజేపీ ప‌రిస్థితి దారుణంగా ఉంది. కానీ, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను మాత్రం బీజేపీ ఆడిస్తోంద‌నే టాక్ ఉంది. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి త‌మిళ‌నాడులో ఏదో ఒక విధంగా అడుగులు వేసేలా.. పావులు క‌దిపేలా క‌మ‌ల నాథులు వ్య‌వ‌హ రిస్తున్నారు. దీనిలో భాగంగా తెలంగాణను రెండు రాష్ట్రాలుగా విభజించగలమని తమకు ఆ అధికారం ఉందని బీజేపీ నేతలు ప్రకటించ‌డం ఇప్పుడు తీవ్ర‌స్థాయి చ‌ర్చకు దారి తీసింది.

అయితే.. నిజంగానే బీజేపీ ఇలా చేసే అవ‌కాశం ఉందా? అంటే.. గ‌త చ‌రిత్ర‌ను చూస్తే.. ఔన‌నే అంటున్నా రు ప‌రిశీల‌కులు. ఆది నుంచి చిన్న రాష్ట్రాల‌ను స‌మ‌ర్ధించే బీజేపీ.. చిన్న రాష్ట్రాల్లో అయితే..తాము త్వ‌ర గా ఎదుగుతామ‌నే కాన్సెప్టును అనుస‌రిస్తొంది. ఈ త‌ర‌హాలోనే ఉమ్మ‌డి ఏపీవిభ‌జ‌న‌కు రాజ్య‌స‌భ‌లో మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. ఇప్పుడు కూడా ఇదే సూత్రాన్ని అనుస‌రించి.. కొన్ని ద‌శాబ్దాలుగా ఎదుగు బొదుగు లేకుండా ఉన్న త‌మిళ‌నాడులో విభ‌జన మంత్రాన్ని ప‌ఠిస్తోంద‌ని తెలుస్తోంది.

అయితే.. తమిళనాడుకు దేశంలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాం తమే కాదు సంస్కృతిలోనూ స్పష్టమైన తేడా ఉంది. తమిళంపై వారు చూపే మక్కువ తక్కువ కాదు. పరా యి భాషలపై మోజు పడితే ఎక్కడ తమిళానికి ఇబ్బంది అవుతుందోనని హిందీ లాంటి భాషలపై వ్యతిరే కత చూపిస్తూ ఉంటారు. ఈ హిందీ వ్యతిరేకత బీజేపీ వంటి పార్టీలకు ఏ మాత్రం నచ్చడం లేదు. అందుకే తమిళనాడులో బలపడలేకపోతున్నామన్న భావన ఉంది.

తెలుగు రాష్ట్రాలను విడగొట్టిన తర్వాత తెలంగాణలో బీజేపీ పుంజుకుంది. ఈ కారణంగా తమిళనాడునూ విభజిస్తే ఎంతో కొంత పార్టీకి మేలు జరుగుతుందని ఆశిస్తున్న‌ట్టు తెలుస్తోంది. విభజన అంశాన్ని తెర‌మీదికి తీసుకురావ‌డం ద్వారా బీజేపీ అనూహ్య‌మైన ఎత్తుగ‌డ వేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఎందుకంటే.. త‌మిళ‌నాడులో సింహ‌ళం మాట్లాడే..(తీర‌ప్రాంత ప్ర‌జ‌లు) వారు త‌మ‌ను ప్ర‌త్యేక దేశంగా గుర్తించాల‌నే డిమాండ్ ఉంది.

దీనిని ఆస‌రా చేసుకుని.. ప్ర‌త్యేక రాష్ట్రం ఇస్తామ‌ని అంటే.. వీరు బీజేపీకి అనుకూలంగా మారే అవ‌కాశం ఉంటుంది. ఇది ఒక‌ర‌కంగా.. బీజేపీకి మేలు చేయొచ్చు. మ‌రి మిగిలిన ప్రాంతం ప‌రిస్థితి ఏంటి? అంటే.. నెమ్మ‌దిగా అక్క‌డ పుంజుకునేది బీజేపీ వ్యూహం అయితే అయి ఉండొచ్చు. ఏదేమైనా.. బీజేపీ వ్య‌వ‌హారం మాత్రం ఆస‌క్తిగా మారింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.