Begin typing your search above and press return to search.

ఏపీలో బీజేపీ మింగేయబోతోంది ఆ పార్టీనేనా....?

By:  Tupaki Desk   |   6 Nov 2022 12:30 AM GMT
ఏపీలో బీజేపీ మింగేయబోతోంది ఆ పార్టీనేనా....?
X
రాజకీయాల్లో అవకాశాలు రావు సృష్టించుకోవాలి. అలాగే పొలిటికల్ స్పేస్ ని క్రియేట్ చేసుకోవాలి. వెనక నంబర్ లో ఉన్న పార్టీ ముందుకు రావాలంటే ముందున్న పార్టీలను ఎలిమినేట్ చేసుకుంటూ పోవాలి. ఇదే పక్కా పొలిటికల్ మాస్టర్ ప్లాన్. ఏపీలో చూస్తే బీజేపీ వెనకబడి ఉంది. అలాగని ఆ పార్టీకి రాజకీయ ఆశలు లేవని, ఏకంగా ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటుందనుకుంటే పొరపాటే. ఏ మత్రం ఉనికి లేని చోట పార్టీ జెండాలు మెరిపించి ఈశాన్య రాష్ట్రాలలో పాగా వేసిన నైపుణ్యం బీజేపీ సొంతం. అందువల్ల ఏపీ లో కూడా బీజేపీ ప్లాన్ అమలు చేయకుండా ఉంటుందా.

అయితే దానికి అనువైన టైం మాత్రం తీసుకుంటుంది. అంతవరకూ ఓపిక పడుతుంది. కేసీయార్ ఈ మధ్య ఆపరేషన్ ఫాం హౌస్ అంటూ నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఏపీ సర్కార్ ని కూడా బీజేపీ అస్థిరం చేయబోతోందని, నెక్స్ట్ టార్గెట్ అదేనని చెప్పుకొచ్చారు. వివరంగా ఆలోచించి చూస్తే ఏపీలో అలాంటి పరిస్థితి ఉందా అన్నదే డౌట్. ఏపీలో జగన్ 151 సీట్లతో బలంగా ఉన్నారు. పైగా ఆయనకు పార్టీ మీద ప్రభుత్వం మీద పూర్తి పట్టు ఉంది. ఇక వైసీపీలో ఉన్న వారంతా కూడా జగన్ అంటే ప్రేమగా ఉంటారు. వైఎస్సార్ ఫ్యామిలీ అంటూ ఒక ఎమోషనల్ బాండింగ్ పార్టీలో అత్యధికులకు ఉంది.

ఆ విధంగా చూస్తే అధికార వైసీపీని చీల్చడం అంటే బీజేపీకి బిగ్ రిస్క్ తో సమానం. పైగా అది బూమరాంగ్ అయి వైసీపీకే రాజకీయంగా అడ్వాంటేజ్ గా మారుతుంది. అదే సమయంలో వైసీపీ కూడా బీజేపీకి పరోక్ష మిత్రుడిగా వ్యవహరిస్తోంది. రేపటి ఎన్నికల తరువాత కూడా వైసీపీ ఎంపీలు బీజేపీకే మద్దతు ఇస్తారు తప్ప ఎట్టిపరిస్థుల్లో కాంగ్రెస్ వైపు పోరు. ఆ భరోసా బీజేపీకి ఉంది. అలాంటపుడు వైసీపీని ఎందుకు కూల్చే దుస్సాహసం చేస్తారు అన్నది ఇక్కడ ప్రశ్న.

ఆ విధంగా ఆలోచిస్తే ఏపీలో ప్రదాన ప్రతిపక్షం టీడీపీ మీదనే బీజేపీ కన్ను ఉండొచ్చు అని అంటున్నారు. బీజేపీ ఓటు బ్యాంక్ కూడా టీడీపీ దే అని చెబుతారు. ఆ విధంగా చూస్తే బీజేపీ ఎదగాలీ అంటే ముందు ప్రతిపక్ష స్థానంలోకి రావాలి. బీజేపీ దేశంలో చాలా రాష్ట్రాలలో అనుసరించిన విధానం కూడా అదే. ఎకాఎకీన అధికారం కోసం ఆ పార్టీ చూడదు, ముందు ప్రధాన ప్రతిపక్షంగా అవతరించి ఆ మీదట కుర్చీ కోసం కుస్తీ చేస్తుంది

అది కనుక చూస్తే బీజేపీ టార్గెట్ టీడీపీ అనే అంటున్నారు. ఇక టీడీపీకి చెందిన ఎంపీ కేశినేని నాని కూడా ఆ మధ్యన మాట్లాడుతూ టీడీపీలో ఏక్ నాధ్ షిండేలు ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బీజేపీలో ఉన్న సీఎం రమేష్ లాంటి వారిని ఉదహరించారు కూడా. మరో వైపు చూస్తే జూనియర్ ఎన్టీయార్ తో అమిత్ షా భేటీ కూడా లాంగ్ టెర్మ్ పాలిటిక్స్ ని దృష్టిలో పెట్టుకునే అని అంటున్నారు. టీడీపీలో ఒక సెక్షన్ జూనియర్ ని కోరుకుంటోంది. దాంతో ఆపరేషన్ టీడీపీని చేపడితే జూనియర్ తమ వైపు ఉండడం మంచిదనే ఆయన్ని దగ్గర చేస్తున్నారు అని చెబుతున్నారు.

ఇలాంటి విశ్లేషణలు చూసుకున్నపుడు కచ్చితంగా టీడీపీనే బీజేపీ టార్గెట్ చేస్తోంది అని అర్ధమవుతోంది అంటున్నారు. అయితే టీడీపీ కూడా ఆషామాషీ పార్టీ కాదు. పదేళ్లకు పైగా అధికారం నుంచి దూరం అయినా ఆ పార్టీ నిలదొక్కుకుంది. 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా గట్టిగా పోరాటం చేస్తోంది. అన్నింటికీ మించి చంద్రబాబు చాణక్య రాజకీయమే ఆ పార్టీకి శ్రీరామ రక్ష. అందువల్ల ఏపీలో బీజేపీ ప్లాన్స్ సక్సెస్ అవాలీ అంటే అది కాస్తా ఆలోచించాల్సిన విషయమే అంటున్నారు.