Begin typing your search above and press return to search.
సౌత్ ఇండియా మీద బీజేపీ సవతి ప్రేమనా...?
By: Tupaki Desk | 28 Dec 2022 11:30 AM GMTబీజేపీ అంటేనే ఉత్తరాది పార్టీ అని దశాబ్దాలుగా ప్రచారంలో ఉన్న మాట. దానికి తగినట్లుగా ఆ పార్టీ ఎపుడూ అక్కడ నుంచే మెజారిటీ సీట్లు గెలుచుకుంటుంది. ఇక దక్షిణాదిన బీజేపీ బలపడాలని ఎపుడు చూసినా కూడా అది సాధ్యపడడంలేదు. కర్నాటకలో కొద్దో గొప్పో బీజేపీ ఎదిగింది. దాంతో బీజేపీ రాజకీయంగా కూడా కీలకమైన పదవులు అన్నీ కూడా ఉత్తరాది నేతలకే ఇస్తుంది అన్న విమర్శలు ఉన్నాయి.
ఇక దేశ ఖజానా నుంచి అందరికీ పంచాలి అన్న ఆలోచనలు కూడా పక్కన పెట్టి ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు అందునా తమకు రాజకీయంగా అనుకూలంగా ఉండే రాష్ట్రాలకు బీజేపీ ఎపుడూ అభివృద్ధి పేరిట నిధులను పెద్ద ఎత్తున కేటాయిస్తూ ఉంటుంది అన్న ఆరోపణలు ఉన్నాయి. సౌత్ మీద బీజేపీ సవతి ప్రేమను చూపిస్తుంది అని అంతా అంటూంటారు.
బీజేపీ సాలిడ్ గా చూస్తే సౌతిండియాకు ఏమిచ్చింది అన్న ప్రశ్న కూడా వేసేవారు ఉన్నారు. ప్రజలు కూడా దీని మీదనే బీజేపీ పాలకులను ఎప్పటికపుడు నిలదీస్తారు. అయితే దీనికి బీజేపీ పెద్దలు గడుసుగా జవాబు చెబుతారు. హైవేస్ సౌత్ స్టేట్స్ కి ఇచ్చామని అంటూంటారు. ఇక ఎవరికీ అర్ధం కాని కాకి లెక్కలు కూడా చూపిస్తూ ఉంటారు. ఆ వివరాలు బీజేపీ వారికి తప్ప ఎవరికీ అంత సులువుగా బోధపడవు అన్న మాటా ఉంది.
ఏపీ విషయమే తీసుకుంటే ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు అంటే దానికి సరిసాటిగా అంతకు మించి అన్నట్లుగా పెద్ద ఎత్తున నిధులను అనేక పధకాల రూపంలో ఇచ్చామని బీజేపీ నేతలు వల్లిస్తూంటారు. కానీ నిజానికి చూస్తే అన్నేసి నిధులు ఏపీకి వస్తే ఇన్నేసి అప్పులు ఎందుకు చేస్తుంది. అభివృద్ధి అన్నదే లేకుండా ఎక్కడో మూలన విసిరేసినట్లుగా ఎందుకు పడి ఉంటుంది అన్న ప్రశ్నలు కూడా మేధావుల నుంచి సామాన్యుల దాకా వస్తాయి.
కానీ బీజేపీ మాత్రం తర్కానికి పోదు, తాము ఏమి చెప్పాలనుకుంటుందో అదే చెబుతుంది. ఇదిలా ఉంటే ఉద్యోగాల విషయంలో బీజేపీ మాటలు నీటి మూటలే అయ్యాయని చెప్పాల్సి ఉంటుంది. మోడీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చే ముందు అతి పెద్ద హామీ ఇచ్చింది. తాము కనుక అధికారంలోకి వస్తే ఏడాదికి కోటి మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. ఇప్పటికి తొమ్మిదేళ్ళుగా పవర్ లో ఉంది. ఆ లెక్కన దేశంలో తొమ్మిది కోట్ల మందికి ఉద్యోగాలు ఇవాల్సి ఉంది. కానీ అలా జరిగిందా అంటే లేదు అన్న జవాబు ఎవరైన చెబుతారు.
అసలు ఆ హామీ కూడా ఎక్కడ ఉందో ఎవరూ చెప్పలేరు అంటున్నారు. ఇక అభివృద్ధి ఏమి చేశారు స్వామీ అంటే దానికంటే ముందు హిందూత్వ నినాదాన్నే బలంగా వినిపిస్తూ ఉంటుంది బీజేపీ. ఒక్క హిందూత్వ మంత్రం చాలు అందరూ హాయిగా ఉంటారన్నదే వారి విధానంగా కనిపిస్తోంది. కానీ డెవలప్మెంట్ అలా ఊరకే రాదు కదా. దానికి ప్రణాళికలు ఉండాలి. దేశాన్ని పదేళ్ళు ఇరవయ్యేళ్ళు ముందుకు తీసుకెళ్లేలా దీర్ఘకాలిక ప్రణాళికలు రచించాలి కానీ ఆ దిశగా ఈ తొమ్మిదేళ్ళలో కాంక్రీట్ గా ఒక ప్రణాళిక అయినా బీజేపీ పాలకులు రూపొందించలేకపోయారు అన్న విమర్శలు అయితే అంతటా ఉన్నాయి మరి.
ఇక హిందూత్వ అని వీర లెవెల్ లో సౌండ్ చేస్తున్న బీజేపీ దానిని నమ్ముకున్న దాని కోసం బీజేపీకి ఓట్లేస్తున్న హిందువుల కోసం అయినా ఏమైనా కచ్చితమైన మేలు చేసిందా అంటే దానికీ జవాబు లేదు. ఇదంతా కేవలం ఓట్ల కోసం గారడీగా కనిపిస్తోంది తప్ప మరేమీ కాదు అనే చెప్పాల్సి ఉంటుంది. ఇక దేశంలో అభివృద్ధి శూన్యం అనుకుంటే సౌత్ లోని స్టేట్స్ కి వాటి విషయంలో అసలు ఏమీ దక్కేది లేదనే అంటారు. మొత్తానికి బీజేపీ సౌతిండియా విషయంలో ఏమీ చేయలేదు అన్న భావన అంతటా ఉంది.
ప్రతీ ఎన్నికకూ సౌత్ స్టేట్స్ మీద ఫోకస్ చేస్తున్న బీజేపీ తాను పవర్ ఉన్న వేళ ఆ పుణ్యకాలమంతా ఉత్తరాదికే ప్రయారిటీ ఇస్తూ కేవలం దక్షిణాదిని మాత్రం ముందు ఓట్లేయండి తరువాత చూద్దామంటూ రాజకీయ బేరాలు ఆడడంతోనే జనాలకు చిర్రెత్తుకొస్తోంది అని అంటున్నారు. సౌతిండియాలో ఎటూ బీజేపీ కొత్త రాజకీయ కట్టే సీన్ అయితే కనిపించడంలేదు, ఆ విధంగానే బీజేపీ సవతి తల్లి ప్రేమ కూడా అలాగే కంటిన్యూ అయ్యే సీన్ ఉంది. ఈ విషయం అందరికీ అర్ధమవుతోంది. బీజేపీకీ తెలుసు. అందుకే మాటలే తప్ప చేతలు అసలు కానరావు అని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.