Begin typing your search above and press return to search.

నిమ్మగడ్డ వెనుక బీజేపీ ఉందా?

By:  Tupaki Desk   |   23 Jun 2020 11:50 AM GMT
నిమ్మగడ్డ వెనుక బీజేపీ ఉందా?
X
టీడీపీ అధినేత చంద్రబాబు గెలిచినా.. ఓడినా.. ఆయన కోటరీ మాత్రం చెక్కు చెదరకుండా కొనసాగుతోందని.. అందుకే అధికార వైసీపీని అన్ని వైపుల నుంచి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారనే ప్రచారం రాజకీయవర్గాల్లో ఉంది. బీజేపీతో ఎన్నికలకు ముందు తొడగొట్టినా.. బాబు ఇప్పుడు అదే బీజేపీని శరణు వేడుతున్నారు. బీజేపీని శాంతపరచడానికి తన అనుంగ అనుచరులు అయిన టీడీపీకి బ్యాక్ బోన్ గా ఉన్న నలుగురు టీడీపీ రాజ్యసభ ఎంపీలను పల్లెంలో పెట్టి మరీ బీజేపీలోకి సాగనంపారు. వారు బీజేపీలోనే ఉన్న చంద్రబాబు, టీడీపీ కోసమే పనిచేస్తున్నారన్న విమర్శలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి.

టీడీపీ అధికారంలో లేనప్పటికీ.. త్వరలో తిరిగి అధికారంలోకి రాలేకపోయినప్పటికీ బీజేపీలోని ఒక విభాగం టీడీపీ కోసం పనిచేస్తూనే ఉందనే గుసగుసలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంటాయి. బీజేపీలో చేరిన టీడీపీ విధేయులు ఇప్పటికీ టీడీపీ ప్రయోజనాలను పరిరక్షించడానికి కృషి చేస్తూనే ఉన్నారన్న ప్రచారం ఉంది. తాజాగా రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పై కేసులోనూ చంద్రబాబుపై బీజేపీ లో ఉన్న ఆయన కోవర్టుల ప్రేమ బయటపడిందంటున్నారు.

రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పై హైకోర్టుకు ఎక్కింది ఎవరో కాదు.. మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు కామినేని శ్రీనివాస్. రాజ్యాంగ పదవుల గౌరవాన్ని పరిరక్షించాలనే నెపంతో ఆయన కోర్టును ఆశ్రయించాడు. తనకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అనుమతి ఉందని.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేడీ నడ్డాకు ఈ విషయం తెలుసనని పేర్కొన్నాడు.

అయితే అదే కేంద్రంలోని బీజేపీ ఏపీలో ఉన్న వైసీపీ ప్రభుత్వంతో అనుకూలంగా వ్యవహరిస్తోంది. బీజేపీ నేతగా ఉన్న కామినేని వైసీపీని బీజేపీ హైకమాండ్ వ్యతిరేకిస్తుందనే అభిప్రాయాన్ని హైకోర్టుకు ఎక్కడం ద్వారా వ్యాపింపచేశాడు. టీడీపీ చేయాల్సిన పనిని ఈ బీజేపీ నేత చేయడం.. హైకోర్టుకు ఎక్కడంతో ఈయన చంద్రబాబు కోవర్టా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కామినేని బీజేపీ లో ఉన్నా మనసంతా టీడీపీ నే అని నిమ్మగడ్డ వ్యవహారంతో నిరూపితమైంది.

నిమ్మగడ్డ రమేష్ కు బ్యాక్ బోన్ గా బీజేపీ ఉందా అని ఈ పరిణామాలతో ప్రజల్లో అనుమానం వస్తోంది. ఎందుకు అంటే నిమ్మగడ్డకు అనుకూలంగా కేసులు వేయడంలో బీజేపీ నేతలే ముందు వరసలో ఉంటున్నారు. అదేవిధంగా తాజాగా హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో నిమ్మగడ్డ ఇద్దరు బీజేపీ నాయకులు సుజనాచౌదరి, కామినేనితో డైరెక్టుగా కలుసుకున్నారు. ఈ సంకేతం వైసీపీకి ఇన్ డైరెక్టుగా బీజేపీ పనిచేస్తోందనే అనుమానం వస్తోంది.