Begin typing your search above and press return to search.
బ్రేకింగ్.. బీజేపీ ప్రెసిడెంట్ గా ఈటల - కోమటిరెడ్డి - డీకే అరుణ.. అధిష్టానం పిలుపు?
By: Tupaki Desk | 15 Nov 2022 9:36 AM GMTతెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం అడుగులు వేస్తోంది. ఈ మేరకు అందివచ్చే ఏ అవకాశాన్ని వదలుకోవడం లేదు. అలాగే మైనస్ లను కూడా కరెక్ట్ చేసుకోవడానికి సిద్ధమైంది. తెలంగాణలో బీజేపీకి దశ, దిశ ఇవ్వడానికి రెడీ అయ్యింది. ఈ మేరకు బీజేపీకి ఒకప్పుడు బలంగా మారి.. ఇప్పుడు బలహీనతగా మారిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను సాగనంపేందుకు రెడీ అయ్యిందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో బండి సంజయ్ వ్యవహరించిన తీరు.. ప్రచార లోపాలు.. నిర్వహణ సరిగ్గా లేకనే ఓడారని.. అందుకే అతడిని పక్కనపెట్టేందుకు రెడీ అయ్యారని సమాచారం.
ఇక బండి సంజయ్ ఉంటే వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం కష్టమని.. ప్రత్యర్థులకు బండి సంజయ్ చర్యలే వరంగా మారి బీజేపీ పరువు తీస్తున్నాయని బీజేపీ అధిష్టానం గ్రహించింది.
అప్పట్లో అమిత్ షా చెప్పులు మోయడం నుంచి.. ఇటీవల యాదాద్రిలో తడిబట్టలతో కేసీఆర్ కు సవాల్ చేయడం వరకూ అన్నీ కూడా బీజేపీకి మైనస్ అయినట్టు అధిష్టానం గుర్తించింది. ప్రచార లోపాలు.. బండి సంజయ్ తీరు వల్ల బీజేపీకి ఓటు బ్యాంకు, కార్యకర్తలు,నేతలు దూరం అవుతున్నట్టు అంతర్గత సర్వేలు.. నేతల నుంచి ఫిర్యాదులు అందాయి.
అందుకే సడెన్ గా బీజేపీ అధిష్టానం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మార్చడానికి రెడీ అయ్యిందని.. బీజేపీ కొత్త ప్రెసిడెంట్ రేసులో ప్రధానంగా ఈటల రాజేందర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డీకే అరుణలను ఢిల్లీకి పిలిపించినట్టు తెలిసింది. ఈ మేరకు బీజేపీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. బండి సంజయ్ పనికిరాడు అని డిసైడ్ అయ్యాకే వారిని పిలిపించినట్టు ప్రచారం సాగుతోంది.
ఇప్పటివరకూ కూడా బండి సంజయ్ అంటే ప్రజలకు తెలియదని సర్వే రిపోర్టులో తేలిందట.. బీజేపీ నేతలు సర్వేలపైనే ఆధారపడుతారు. బూత్ స్థాయి లోని వారిని ఆరాతీశారు. బూత్ స్థాయిలో బండి సంజయ్ పేరు తెలియదు అని క్యాడర్ చెప్పారంట.
సో పేరున్న నేత కావాలని.. రాష్ట్ర నాయకత్వాన్ని సరిగ్గా నడిపించే నేతకే పగ్గాలు ఇవ్వాలని డిసైడ్ అయిన అధిష్టానం ఈ మేరకు ఈటల, అరుణ, కోమటిరెడ్డిని ఢిల్లీ పిలిపించినట్టు సమాచారం. వీరి ముగ్గురిలో ఒకరు తెలంగాణ కొత్త బీజేపీ చీఫ్ ఖాయమని ఢిల్లీలో జోరుగా ప్రచారం సాగుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.