Begin typing your search above and press return to search.

ఏపీపై గోవా వ్యూహం.. బీజేపీ తేల్చేసిందా...?

By:  Tupaki Desk   |   14 Dec 2022 4:15 AM GMT
ఏపీపై గోవా వ్యూహం.. బీజేపీ తేల్చేసిందా...?
X
ఏపీలో రాజ‌కీయ ప‌రిస్థితిపై కేంద్రంలోని బీజేపీ నాయ‌కులు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారా? ఏపీలో త‌మ‌కు ఉన్న అవ‌కాశాల‌ను వారు అంచ‌నా వేసుకున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా ఢిల్లీ నుంచి అందుతున్న స‌మాచారం మేర‌కు.. ఏపీలో ఇప్పుడున్న రాజ‌కీయాలు మారే ప‌రిస్థితి లేద‌ని.. మ‌రోసారి వైసీపీనే వ‌స్తుంద‌ని బీజేపీ ఖ‌చ్చితంగా చెబుతున్న‌ట్టు తెలుస్తోంది.

అంత‌ర్గ‌త స‌ర్వేలు ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. కొంద‌రు బీజేపీ నాయ‌కులే చూచాయ‌గా.. ఇక్క‌డి ప‌రిస్థితి కేంద్రాని కి నివేదించార‌ని.. దానిని అంచ‌నా వేసుకున్న పెద్ద‌లు.. ప్ర‌స్తుతం వైసీపీ ప‌వ‌నాలే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. ఇక‌, టీడీపీ అంతో ఇంతో ప్ర‌భావం చూపుతుంద‌నే లెక్క‌లు ఉన్నా.. కేసీఆర్ వంటి కీల‌క నేత‌ల రంగ ప్ర‌వేశంతో ఆ పార్టీ ఓటు బ్యాంకు ఘోరంగా దెబ్బ‌తినే ప‌రిస్థితి వుంటుంద‌ని లెక్క‌లు వేసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.

ఇక‌, ఇక్క‌డ బీజేపీకి క‌లిసి వ‌చ్చే ప‌రిస్థితి ఏంటంటే.. ఏపీ ఎంత నాశ‌నం అయితే.. అది త‌మ‌కు అంత‌గా ఉప‌యోగ‌ప‌డుతుంద‌నేది వారి భావ‌న‌గా ఉంది. ప్ర‌స్తుతం ఉచిత ప‌థ‌కాలు, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌తో రాష్ట్రం అప్పులు పెరిగిపోయాయి. సో.. దీనిని ఇంకా కొన‌సాగించేందుకు రాష్ట్రంలోని వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంది.

దీనికి కేంద్రం కూడా స‌హ‌క‌రిస్తోంది. దీనివెనుక ఉద్దేశం.. రాష్ట్రం మ‌రింత అప్పులు చేస్తే.. త‌ద్వారా వ‌చ్చే ఇబ్బందులు, క‌ష్ట‌న‌ష్టాల‌నుత‌మ‌కు అనుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్నం చేయొచ్చు.

గ‌తంలో గోవాలోనూ ఇలానే అక్క‌డ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న తీరును బీజేపీ నేత‌లు తెర‌మీదికి తెస్తున్నారు. అయితే.. ఇది ఇప్ప‌టికిప్పుడు జ‌రిగిపోయే వ్య‌వ‌హారం కాదు.. కానీ, వ‌చ్చే 2029 ఎన్నిక‌ల నాటికి మాత్రం ఇదే సూత్రాన్ని ఏపీలో పాటించి.. ఖ‌చ్చితంగా అడుగులు వేయొచ్చ‌ని స‌మాచారం.

ముందు తెలంగాణ‌లో ప‌ట్టు పెంచుకుని.. త‌ద్వారా ఏపీలో అడుగుల వేగం పెంచేయొచ్చ‌ని అంటున్నారు. మొత్తాని బీజేపీ గోవా వ్యూహం ఏమేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.