Begin typing your search above and press return to search.
వైసీపీతో బీజేపీ బంధం గట్టి పడుతోందా... ?
By: Tupaki Desk | 22 Feb 2022 2:30 PM GMTదేశంలో రాజకీయం ఒకలా సాగుతోంది. యాంటీ మోడీ స్టాండ్ తో రీజనల్ పార్టీలతో సహా జాతీయ ప్రతిపక్షాలు ముందుకు సాగుతున్నాయి. పొరుగునే ఉన్న తెలంగాణా సీఎం కేసీయార్ అయితే కాలికి బలపం కట్టుకుని బీజేపీకి ఆల్టర్నేషన్ ని భారత దేశాన తీసుకువస్తామని చెబుతున్నారు. ఈ నేపధ్యంలో ఏపీలో మాత్రం రాజకీయం దీనికి పూర్తిగా వేరేగా సాగుతోంది. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్ మాత్రం మోడీ వ్యతిరేక వైఖరిని ఇప్పటికీ అసలు కనబరచడంలేదు.
పైగా మోడీ క్యాంప్ కు మరింత దగ్గర కావాలనుకుంటోంది అని ప్రచారం సాగుతోంది. ఏపీలో ఉన్న ఆర్ధిక, రాజకీయ పరిస్థితులు కూడా వైసీపీని బీజేపీ వైపు ఉండేలా చేస్తున్నాయని అంటున్నారు. ఏపీలో పొలిటికల్ గా పోటాపోటీ వాతావరణం ఉంది. ఒకవేళ జగన్ కనుక బీజేపీతో సానుకూలంగా ఉండకపోతే ఆ వెంటనే అక్కున చేర్చుకునేందుకు చంద్రబాబు రెడీగా ఉన్నారు. బీజేపీ కూడా చురుకుగా పావులు ఆ దిశగా కదుపుతుంది.
దాంతో చంద్రబాబు రాజకీయంగా ఏపీలో బలపడే పరిస్థితి వస్తుంది. అలాంటి చాన్స్ బాబుకు ఇవ్వకూడదనే వైసీపీ బీజేపీతో సాన్నిహిత్యాన్ని నెరుపుతోంది. ఈ రాజకీయ ఎత్తుగడలతో ఏపీ మాత్రం జాతీయ స్థాయిలో విపక్ష రాజకీయాల వైపు చూడలేకపోతోంది అంటున్నారు. ఇంకో వైపు చూస్తే ఏపీలో ఆర్ధిక పరిస్థితి ఏ మాత్రం బాగులేదు. కేంద్రంతో గుడ్ రిలేషన్స్ మెయిన్ టెయిన్ చేయకపోతే ఆ వచ్చే అరకొర ఆర్ధిక సాయం కూడా లేకుండా పోతుంది అన్న భయాలు కూడా వైసీపీకి ఉన్నాయని అంటున్నారు.
అదే విధంగా ఏపీకి సంబంధించి ప్రత్యేక హోదా సహా విభజన హామీలు కూడా బీజేపీ నెరవేర్చకుండా ఉంది. ఈ సమయంలో బీజేపీతోనే మంచిగా ఉంటూ వాటిని సాధించుకుంటామన్న నమ్మకాన్ని వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ తమ వైపునకు వచ్చే రోజులు ముందు ముందు ఉన్నాయని కూడా అంచనా వేస్తున్నారు.
ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెలువడనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఏ మాత్రం అనుకూలంగా ఉండవని వైసీపీ నేతలు అంచనా కడుతున్నారు. అదే కనుక జరితే మాత్రం బీజేపీ పెద్దలు కచ్చితంగా తమ వైపే చూస్తారని, అపుడు తాము అనుకున్న డిమాండ్లను ఏవైనా కేంద్రం నుంచి సులువుగా సాధించుకోగలమని కూడా భావిస్తున్నారు.
ఇక ఉత్తరాది ఫలితాల తరువాత వైసీపీ బీజేపీల మధ్య సంబంధాలు మరింత గట్టిపడతాయని కూడా అంటున్నారు. ఎవరెన్ని అనుకున్నా వచ్చే ఎన్నికల్లో బీజేపీకి కనీసంగా 200 సీట్లు వస్తాయని, మిత్రులతో కలసి మరోమారు బీజేపీయే కేంద్రంలో అధికారంలోకి వస్తుంది అన్న లెక్కలు కూడా వైసీపీ నేతల వద్ద ఉన్నాయని అంటున్నారు. ఈ నేపధ్యంలోనే విపక్ష కూటముల వైపు వైసీపీ చూడడంలేదని అంటున్నారు. మొత్తానికి చూస్తే మార్చి 10 తరువాత వైసీపీ, బీజేపీల మధ్య మరింతగా అనుబంధం పెరుగుతుందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.