Begin typing your search above and press return to search.
ఏపీ నేతలతో బీఆర్ఎస్ టచ్ లో ఉందా ?
By: Tupaki Desk | 13 Oct 2022 4:59 AM GMTకేసీయార్ నాయకత్వంలోని జాతీయపార్టీ ఇతర రాష్ట్రాల్లో విస్తరించేందుకు ప్లాన్ వేస్తోంది. కేసీయార్ మాటల్లోనే మహారాష్ట్ర, కర్నాటకపైన దృష్టిపెట్టింది. ఈ రెండు రాష్ట్రాలపైన దృష్టి ఎందుకు పెట్టినట్లు ? ఎందుకంటే నిజాంపాలనలో తెలంగాణాతో పాటు మహారాష్ట్ర, కర్నాటక కలిపే ఉండేది కాబట్టి. సరే డైరెక్టుగా ప్రకటించారు కాబట్టి పై రెండు రాష్ట్రాల సంగతి ఓకే. మరి ప్రకటించని ఇతర రాష్ట్రాల సంగతేంటి ? ఏమిటంటే ఇక్కడే ఏపీ విషయం ప్రస్తావనకు వస్తోంది.
దేశంలో ఏ రాష్ట్రంలో పార్టీ పరిస్ధితి ఎలాగున్నా సాటి తెలుగురాష్ట్రం ఏపీలో కనీసం ఉనికి చాటుకోవాలి కదా ? అందుకనే ఏపీలోని ఇతరపార్టీలకు చెందిన సీనియర్ నేతలతో బీఆర్ఎస్ టచ్ లో ఉందని సమాచారం.
బీఆర్ఎస్ తరపున మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఏపీలోని కొందరు నేతలతో మాట్లాడుతున్నారట. ఉత్తరాంధ్రకు చెందిన కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు, డీఎల్ రవీంద్రారెడ్డి లాంటి వాళ్ళతో తలసాని మాట్లాడినట్లు సమాచారం.
అడ్డుగోలు రాష్ట్ర విభజనకు కారకుడైన, ఉద్యమ సమయంలో కానీ విభజన తర్వాత కూడా సీమాంధ్ర ప్రజలను, సంస్కృతిని కేసీయార్ ఎంతలా అవమానించారో అందరికి తెలిసిందే.
అప్పట్లో నోటికొచ్చింది మాట్లాడి ఇపుడు తన అవసరాల కోసం ఏపీలో పోటీచేస్తే జనాలు ఎలా స్పందిస్తారు అన్నది కీలకమైన పాయింట్. కరోనా వైరస్ కాలంలో రోగులు ఏపీలో నుండి హైదరాబాద్ కు రానీకుండా కేసీయార్ అడ్డుకున్న విషయాన్ని జనాలు గుర్తుచేసుకుంటున్నారు.
అదంతా చరిత్రగా అనుకున్నా బీఆర్ఎస్ లో చేరబోయే నేతలెవరు ? పోటీచేయబోయే నేతలెవరు అనే విషయాలపై చర్చలు మొదలయ్యాయి. తొందరలోనే ఏపీలో బీఆర్ఎస్ బహిరంగసభ నిర్వహించాలని అనుకుంటున్నది. ఈలోగానే బీఆర్ఎస్ లో చేరబోయే నేతలపై స్పష్టమైన అవగాహన రావాలని తలసానిని కేసీయార్ ఆదేశించారట. ఎందుకంటే బహిరంగసభలోనే కొందరు సీనియర్ నేతలను చేర్చుకుని జనాలకు బీఆర్ఎస్ నేతలుగా పరిచయం చేయాలన్నది కేసీయార్ ఉద్దేశ్యంగా తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.