Begin typing your search above and press return to search.

జగన్మాయను చంద్రబాబు డీకోడ్ చేసేశారా? అందుకే ఈ 2 మాటలు?

By:  Tupaki Desk   |   22 Nov 2022 4:14 AM GMT
జగన్మాయను చంద్రబాబు డీకోడ్ చేసేశారా? అందుకే ఈ 2 మాటలు?
X
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ప్రతి మాట ఉత్తినే మాట్లాడరు. ఆయన వేసే ఎత్తులు.. ప్రత్యర్థులు వేసే పైఎత్తులకు ఏ మాత్రం అందనంతగా ఉండటం జగన్ కు అలవాటే. ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేసే బలహీనత ఉన్న చంద్రబాబు కారణంగా ఇంతకాలం కొరుకుడుపడని జగన్ ఇప్పుడు అర్థం కావటమే కాదు.. ఇంతకాలం ఇదెక్కడి జగన్మాయ? అన్న క్వశ్చన్ కు సమాధానం వచ్చేసిందని చెబుతున్నారు.

ఈ విషయాన్ని గుర్తించిన జగన్మోహన్ రెడ్డి.. తన మాటల్ని మార్చేస్తూ.. ప్రత్యర్థికి అర్థంకాని కొత్త ఎత్తును వేస్తున్నారన్న మాట వినిపిస్తోంది. మొన్నటివరకు వచ్చే ఎన్నికల్లో 175 సీట్లకు 175 సీట్లు అనేసిన జగన్మోహన్ రెడ్డి మాటకు.. ఇవే చివరి ఎన్నికలు.. మీరు గెలిపిస్తే సరి అంటూ సరైన రీతిలో రియాక్టు అయిన చంద్రబాబు మాటలు వైసీపీ పరివారానికి షాకింగ్ గా మారినట్లు చెబుతున్నారు.

ఈ ఎత్తును ఊహించలేదన్న మాట వినిపిస్తోంది. అందుకే 175 సీట్ల గెలుపునకు.. కుప్పంలో చంద్రబాబు ఓటమి భయం అంటూ కొత్త కాన్సెప్టును తెర మీదకు తీసుకొచ్చి.. మాంచి టైం చూసుకొని మరీ బాబు పరివారంపై విరుచుకుపడే ఎత్తుగడకు తెర తీశారని చెబుతున్నారు.

కుప్పంలో ఓటమి అన్న మాట కావొచ్చు.. 175స్థానాల్లో గెలుపు పక్కా.. లాంటి మాటల వెనుక అసలు అర్థం వేరే ఉందంటున్నారు. చంద్రబాబు బలం.. బలహీనత కుప్పమే కావటంతో.. కుప్పం కోట కదిలిపోతుందన్న భావన కలిగించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు.

దీనికి కారణం లేకపోలేదు. అధినేత సొంత ప్రాంతంలోనే వీక్ గా ఉన్నారంటే.. మిగిలిన ప్రాంతాల్లో మరెంతబలహీనంగా ఉన్నారో తెలుసా? అన్న భావన మనసులోకి తీసుకొచ్చేందుకు.. భయాన్ని కలిగించటమే జగన్ లక్ష్యమని చెబుతున్నారు.

175 స్థానాలకు 175 గెలుపు అసాధ్యమైనప్పటికీ.. అది చాలా సింపుల్ టాస్కు అని చెప్పటం ద్వారా.. అంతటి ఘన విజయం మీద ఎంత నమ్మకం.. విశ్వాసం లేకుంటే అంత సింపుల్ గా ఎలా చెబుతారన్న సందేహాన్ని కలిగించటమే జగన్ లక్ష్యమని చెబుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన చంద్రబాబు.. ఇవే తనకు చివరి ఎన్నికలు అనే అనూహ్య అస్త్రాన్ని బయటకు తీసి.. భావోద్వేగాన్ని రగిలించే ప్రక్రియను షురూ చేశారు. ఏమైనా.. జగన్ వ్యూహాన్ని చంద్రబాబు క్రాక్ చేయగలిగారన్న భావన కలిగించేలా బాబు మాటలు ఉన్నాయని చెబుతున్నారు. అదెంత నిజమన్నది రానున్న రోజులు మరింతగా స్పష్టం చేస్తాయని చెప్పాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.