Begin typing your search above and press return to search.
చంద్రబాబు ‘మాస్టర్’ ప్లాన్ వేస్తున్నాడా..?
By: Tupaki Desk | 27 April 2021 10:31 AM GMTఏపీలో ఏ ఎన్నిక జరిగినా వరుస ఓటములతో కుంగిపోతున్న టీడీపీలోని కొందరు కార్యకర్తలు ముల్లె, ముటా సర్దుకుంటున్నారట. దీంతో పార్టీ అధినేత చంద్రబాబులో సంఘర్షణ మొదలైందని అంటున్నారు. ఇక ఆగేది లేదని.. పార్టీని కాపాడాలని చంద్రబాబు నడుం బిగించాడట. పార్టీపై ఇప్పటికీ కూడా దృష్టి పెట్టకపోతే చాలా ప్రమాదమని ఆలస్యంగా గుర్తించిన బాబు రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని వ్యూహాత్మక పన్నాగం పన్నుతున్నాడట. ఇందులో భాగంగా ఆయన ఒకప్పుడు వైసీపీ వేసిన ప్లాన్ అమలు చేసి పార్టీని కాపాడుకోవాలని చూస్తున్నాడట. మొత్తానికి బాబు ‘మాస్టర్’ప్లాన్ వేస్తున్నాడని పొలిటికల్ గా టాక్ వినిపిస్తోంది..
2019 ఎన్నికల తరువాత టీడీపీ నుంచి అధికార వైసీపీలోకి వలసలు మొదలయ్యాయి. అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. డబ్బు కోసమో తెలియదు.. భయపడో తెలియదు గానీ టీడీపీ క్యాడర్ మెల్లగా వైసీపీలోకి వెళుతూ తుడిచిపెట్టుకుపోతుందట. అదే చంద్రబాబును భయపెడుతుంది. వైఎస్సార్ ఉన్నప్పుడు కూడా టీడీపీలోని ఉండి చాలా మంది నాయకులు పోరాడారు. కానీ జగన్ గవర్నమెంట్ వచ్చాక కొందరు శరీరంలో ఎర్ర రక్తం కాకుండా పచ్చరక్తం ప్రవహిస్తున్న నాయకులు కూడా వైసీపీలోకి చేరుతున్నారు. దీంతో చంద్రబాబు అప్రమత్తమయ్యారు.
ఇప్పటి నుంచి కొత్త క్యాడర్ ను తయారు చేసుకోవాలని సిద్ధమయ్యారు. ఎందుకంటే ఒకప్పుడు వైసీపీ కూడా కొత్త క్యాడర్ ను తయారు చేయడంతో పాతవాళ్లంతా టీడీపీలో చేరారు. దీంతో ఉన్న వాళ్లను కాపాడుకోవాలంటే చంద్రబాబు ఇప్పుడు క్యాడర్ ను పెంచక తప్పడం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కరోనా కాలం అయినందున ఎలాంటి ప్రొగ్రామ్స్ లేవు. దీంతో వాడవాడలా టీడీపీ కార్యకర్తలు సర్వే చేసి యూత్ ను ఆకట్టుకునే పని చేయాలని సూచించాడట.
ఇందులో భాగంగా టీడీపీ వ్యూహకర్త రాబిన్ సింగ్ ను వాడుకొని సోషల్ మీడియా ద్వారా యూత్ ను అట్రాక్ట్ చేస్తే పార్టీకి బలం పెరుగుతుందని అనుకుంటున్నారట. ఇలా సోషల్ మీడియా ద్వారా వైసీపీ గవర్నమెంట్ ను ఇబ్బంది పెట్టే విధంగా పోస్టులు పెట్టించే ఆలోచన చేస్తున్నారట. అలాగే డేటా యాప్స్ తయారు చేయించి ప్రతీ నియోజకవర్గానికో యాప్ ను ఉంచి వారికే అడ్మిన్ ఇచ్చే విధంగా రాబిన్ టీం పనిచేయాలని సూచించాడట. ఇలా చంద్రబాబు వేసే ‘మాస్టర్’ ప్లాన్ వర్కౌట్ అవుతుందా..? లేదా..? చూడాలి.