Begin typing your search above and press return to search.
బాబు సుహాసినిని దూరం పెట్టారా?
By: Tupaki Desk | 14 Dec 2018 10:56 AM GMTకూకట్ పల్లి మహాకూటమి అభ్యర్థి నందమూరి సుహాసినికి సంబంధించిన ఓ మెసేజ్ ఈరోజు సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న పోస్టు ఆమె అక్కౌంట్ లో కనిపించడం లేదు గాని దాని స్క్రీన్ షాట్ మాత్రం వైరల్ అవుతోంది. అందులో ఏముందంటే...
*చాలా బాధ వేస్తుంది నేను ఓడిన రోజు నుంచి నా ఫోన్ ఎత్తని చంద్రబాబు గారు*
ఇదీ ఆమె పేరిట ఉన్న ఫేస్ బుక్ అక్కౌంట్ లో పెట్టినట్టు చెబుతున్న పోస్టు. ఆ పోస్టు పెట్టి గంట తర్వాత డిలీట్ చేశారని - డిలీట్ చేసే లోపు అది ఎవరో స్క్రీన్ షాట్ తీశారని అంటున్నారు. తెలంగాణ ఎన్నికలలో ఆమె పేరు బయటకు వచ్చినప్పటి నుంచి చంద్రబాబుపై చాలా విమర్శలు వచ్చాయి. అనవసరంగా ఆమెను రంగంలోకి దింపారని కొందరు విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆమె ఓడిపోవడం - తర్వాత ఈ మెసేజ్ ఫేస్ బుక్ లో కనపడటంతో కలకలం రేగింది.
అయితే, అసలు ఆమె ఈ పోస్టు పెట్టనేలేదు. అదంతా ఫేక్ అని తెలుగుదేశం పార్టీకి చెందిన అభిమానులు వాదిస్తున్నారు. ఇంకొందరు ఏమో ఆ అక్కౌంట్ ఆమెది కానే కాదు అంటున్నారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద వాగ్యుద్దమే జరుగుతోంది.
ఓ మనిషిని అమాంతం పైకి ఎత్తాలన్నా - అలాగే పాతాళంలోకి నెట్టేయాలన్నా - సోషల్ మీడియాకు సాధ్యం. అందుకే ఇది మంచికి చెడుకు రెండింటికీ వాడుతున్నారు. జనం కూడా దీనిని విశ్వసిస్తున్నారు. ఈ కారణాల వల్ల ఇది నిజమో అబద్ధమో తెలియడం లేదు. ఇది ఫేకా, ఒరిజినలా అన్నది సుహాసిని స్వయంగా దీని గురించి ప్రకటన చేస్తే గాని దీనిపై ఓ క్లారిటీ రాదు.