Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు పరీక్ష పెట్టిన ‘కరోనా’?

By:  Tupaki Desk   |   15 Jun 2020 11:30 AM GMT
చంద్రబాబుకు పరీక్ష పెట్టిన ‘కరోనా’?
X
పోతే ప్రాణభయం.. పోకపోతే పరువు పోవడం ఖాయం. ఇలాంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు 40 ఇయర్స్ ఇండస్ట్రీ టీడీపీ అధినేత చంద్రబాబు. ఆయనను ఇంతలా భయపెడుతోంది ఆ కరోనా మహమ్మారి..

బడ్జెట్ కు ఆమోదు తెలుపడం.. ఆరు నెలల్లోపు ఖచ్చితంగా అసెంబ్లీని సమావేశాన్ని నిర్వహించడం అనివార్యం కావడంతో సీఎం జగన్ రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే కరోనా తీవ్రంగా ప్రబలుతున్న దృష్ట్యా ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం ఓ ఆఫర్ ఇచ్చారు.60 ఏళ్లు పైబడిన ఎమ్మెల్యేలు సభకు హాజరు కావడం వారి ఇష్టమని.. అనివార్యం కాదని.. ఆ వయసు దాటిన వారు భయం ఉంటే సభకు రానక్కర్లేదని పిలుపునిచ్చారు.

ఎందుకంటే 60 ఏళ్లు దాటిన వారికి కరోనా డేంజర్. ప్రపంచంలో ఎక్కువశాతం మరణాలు ఆ వయసు దాటినవారివే. అందుకే స్పీకర్ మినహాయింపునిచ్చారు.

ఈ క్రమంలోనే 70 ఏళ్లు దాటిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడు ఈ పిలుపు ఇజ్జత్ కా సవాల్ గా మారింది. అసెంబ్లీకి పోకపోతే భయపడి పారిపోయాడంటారు. పోతే కరోనాతో పోతామనే భయం. ఈ నేపథ్యంలో 40ఇయర్స్ ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితి బాబుకు ఎప్పుడు ఎదురుకాలేదు. అందుకే ఇప్పుడు అడకత్తెరలో పోకచెక్కలా మారిందట చంద్రబాబు పరిస్థితి.

ఇప్పటికే కరోనా మొదలైనప్పటి నుంచి హైదరాబాద్ లోని తన ఇల్లు దాటి అడుగు బయటపెట్టడం లేదు చంద్రబాబు. ఏపీకి చుట్టుపు చూపుగా మొన్ననే వచ్చి వెళ్లారు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు చంద్రబాబును బుక్ చేశాయి. పార్టీ కార్యక్రమం మహానాడును జూమ్ లో మీటింగ్ పెట్టి మమ అనిపించారు. అలా పెట్టడానికి ఇది తెలుగుదేశం పార్టీ కార్యక్రమం కాదాయే.. ప్రజావేదిక కావడంతో చంద్రబాబు ఇరకాటంలో పడిపోయారు. ఇప్పుడు బాబు ప్రాణాలకు తెగించి అసెంబ్లీకి హాజరు అవుతాడా లేదా అన్నది ఆసక్తిగా మారింది.