Begin typing your search above and press return to search.
చంద్రబాబు ఎవరినీ నమ్మలేకపోతున్నారా ?
By: Tupaki Desk | 3 Sep 2021 5:38 AM GMTతెలుగుదేశంపార్టీ నేతల్లో ఎవరిని నమ్మాలో చంద్రబాబునాయుడుకే అర్ధం కావటంలేదా ? వినటానికే కాస్త ఆశ్చర్యంగా ఉన్నా చెప్పింది సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి కాబట్టి నామ్మాల్సిందే. దాదాపు 15 రోజుల క్రితం రాజమండ్రి రూరల్ ఎంఎల్ఏ గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. రాజీనామపై తొందరలోనే నిర్ణయం తీసుకుంటానని చెప్ప చంద్రబాబునాయుడు, లోకేష్ పై మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలు ఎంత సంచలనమయ్యాయో అందరు చూసిందే.
మధ్యవర్తులు, ఫోన్ సంభాషణలు, బుజ్జగింపులు అన్నీ అయిన తర్వాత గురువారం బుచ్చయ్య అమరావతికి వచ్చి చంద్రబాబుతో దాదాపు 20 నిముషాలు భేటీ అయ్యారు. తర్వాత మీడియాతో మాట్లాడుతు పార్టీ బలోపేతానికి తాను చేసిన సూచనలన్నింటినీ చంద్రబాబు విన్నట్లు చెప్పారు. పార్టీని బలోపేతం చేసే విషయంలో తామిద్దరము మాట్లాడుకున్నామన్నారు. తన పోరాటం రాజమండ్రి గురించి కాదని మొత్తం రాష్ట్రంలో పార్టీగురించని బుచ్చయ్య చెప్పారు.
ఇదే సమయంలో మరో ఆసక్తికరమైన పాయింట్ కూడా రైజ్ చేశారు. అదేమిటంటే పార్టీలో ఎవరిని నమ్మాలో నమ్మకూడదో కూడా తనకు తెలీటం లేదని చంద్రబాబు చెప్పినట్లు గోరంట్ల చెప్పారు. పార్టీ అధికారంలో ఉన్నపుడు చక్రం తిప్పినవాళ్ళల్లో ఇపుడెంతమంది పార్టీలో ఉన్నారు ? ఎంతమంది యాక్టివ్ గా ఉన్నారో చెప్పమని తాను చంద్రబాబును సూటిగా ప్రశ్నించారట. దానికి చంద్రబాబు ఏమి సమాధానం చెప్పలేకపోయారట.
పార్టీకి విధేయులుగా ఉండేవారిని ప్రోత్సహించాలని, పార్టీని వాడుకుని వదిలేసే వాళ్ళని దగ్గరకు చేర్చద్దని చెప్పినట్ల చెప్పారు. మరి ఎవరిని ఉద్దేశించి తాను ఈ మాట చెప్పింది బుచ్చయ్య చెప్పలేదు. తన మాటకు చంద్రబాబు స్పందించి పార్టీలో ఎవరిని నమ్మాలో కూడా తనకు తెలీటం లేదని, అన్నీ పార్టీల్లోను ఇదే పరిస్ధితి ఉన్న విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారని బుచ్చయ్య అన్నారు. చివరకు నమ్మకస్తుల విషయంలో చంద్రబాబు చెప్పింది కూడా నిజమే కదా అంటు బుచ్చయ్య మీడియానే ఎదురుప్రశ్నించటం కొసమెరుపు.