Begin typing your search above and press return to search.

ఏపీ అసెంబ్లీలో టీడీపీ ‘మెన్ ఇన్ బ్లాక్’

By:  Tupaki Desk   |   16 Jun 2020 8:50 AM GMT
ఏపీ అసెంబ్లీలో టీడీపీ ‘మెన్ ఇన్ బ్లాక్’
X
టీడీపీ అధినేత చంద్రబాబు తో పాటు ఆపార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా మెన్ ఇన్ బ్లాక్ గా మారిపోయారు. అసెంబ్లీ సాక్షిగా ‘నలుపు’ రాజకీయం మొదలు పెట్టారు. అప్పుడెప్పుడో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 2019 ఫిబ్రవరి 1న ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనని బీజేపీ ప్రకటించినప్పుడు చంద్రబాబు, ఆయన ఎమ్మెల్యేలు నల్లచొక్కాలు తొడుక్కొని ఏపీ అసెంబ్లీలో నిరసన తెలిపారు.

ఇప్పుడు అదే నల్లచొక్కాలతో మరోసారి ఏపీ అసెంబ్లీకి చంద్రబాబు, ఆయన అనుచరగణం హాజరయ్యారు. 16 నెలల తర్వాత అదే దృశ్యం అసెంబ్లీ పునరావృతమైంది. అయితే నాడు చంద్రబాబు అధికార పక్షం.. నేడు ప్రతిపక్షం లో ఉంది.

తాజాగా చంద్రబాబు నలుపు రంగు చొక్కాలు వేసుకొని రావడం వెనుక కారణం ఏంటంటే తన పార్టీకి చెందిన టీడీపీ నేతలు ఇద్దరినీ అరెస్ట్ చేసినందుకు నిరసనగా బాబు, టీడీపీ ఎమ్మెల్యేలు ఇలా అసెంబ్లీకొచ్చారు. అధికార వైసీపీ కి తమ నిరసనను తెలియజేశారు.

అసెంబ్లీ ప్రాంగణంలో నారా లోకేష్, ఇతర టీడీపీ ఎమ్మెల్యేలు నల్లచొక్కాలు ధరించి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకున్నారు. అసెంబ్లీ లోపల ఏపీ గవర్నర్ హరిచందన్ ప్రసంగం కొనసాగుతుండగా టీడీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి వాకౌట్ చేశారు.