Begin typing your search above and press return to search.

మోడీ ద‌య కోసం చంద్ర‌బాబు కొత్త ఆట మొద‌లెట్టేశారే...!

By:  Tupaki Desk   |   20 Sep 2022 11:30 PM GMT
మోడీ ద‌య కోసం చంద్ర‌బాబు కొత్త ఆట మొద‌లెట్టేశారే...!
X
టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఏం చేసినా.. చాలా దూర‌దృష్టితో చేస్తార‌నే పేరుంది. అది పాల‌న అయినా.. పొత్తులు అయినా.. ఆయన వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతారు. ఇటీవ‌ల ఆయ‌న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో భేటీ అయ్యారు. మాట్లాడింది ఐదు నిమిషాలే అయినా.. దీనివెనుక చాలా వ్యూహం ఉంద‌ని అంటున్నారు.

ఎందుకంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మోడీ మ‌రోసారి దేశంలో పుంజుకునే అవ‌కాశం ఉం టుంద‌ని అంటున్నారు. ఎందుకంటే..త్వ‌ర‌లోనే రాజ్య‌స‌భ‌లో పూర్తి స్థాయిలో బీజేపీ పుంజుకుంటుంది.

దీంతో మోడీ ఇక తిరుగులేని శ‌క్తిగా ఆవిర్భ‌వించ‌నున్నారు. అదేస‌మ‌యంలో కాంగ్రెస్‌పై ఆశ‌లు స‌న్న‌గిల్లు తున్నాయి. కీల‌క నేత‌లు ఒక్కొక్క‌రుగా పార్టీని వీడుతున్నారు. దీంతో ఆ పార్టీ బ‌ల‌హీనం అవుతోంది. ఈ క్ర‌మంలో మోడీ పుంజుకోవడం ద్వారా.. 2024లో మ‌రోసారి ఆయ‌న గెలుపు గుర్రం ఎక్కే సూచ‌న‌లు క‌నిపిస్తు న్నాయి. అదేస‌మ‌యంలో ప్ర‌తిప‌క్షాల ఐక్య‌త అనేది నేతిబీర చంద‌మ‌నే మాట ఎప్ప‌టినుంచో ఉంది. వీరికి ఒక సిద్ధాంతం లేదు. కేవ‌లం మోడీని ఓడించ‌డ‌మేధ్యేయం.

మ‌రి ఆత‌ర్వాత‌.. ఏంటి? అంటే.. ఎవ‌రూ చెప్ప‌లేని ప‌రిస్థితి. సో.. దీనిని బ‌ట్టి ప్ర‌తిప‌క్షాల ఐక్య‌త అనేది ఒట్టిమాటే. ఎన్నిక‌ల నాటికి మ‌ళ్లీ ఏపార్టీకి ఆపార్టీ.. స‌ర్దుకుంటుంది. వీట‌న్నింటినీ.. ముందుగానే ఊహించిన చంద్ర‌బాబు మోడీకి జై కొట్టార‌నేది విశ్లేష‌కుల మాట‌.

ఏపీ విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ కూడా.. మోడీ వ్య‌తిరేక ప‌వ‌నాలు లేవు. అలాగ‌ని పాజిటివ్ ప‌వ‌నాలు కూడా లేవు. కేవ‌లం ధ‌ర‌లు త‌గ్గిస్తే.. చాల‌నేది.. క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌లు చెబుతున్న మాట‌.

ఈ నేప‌థ్యంలో ధ‌ర‌ల త‌గ్గింపు వ్యూహాన్ని అమ‌లు చేయ‌డం ద్వారా.. ప్ర‌జ‌ల మ‌నసులు చూర‌గొనాల‌నేది చంద్ర‌బాబు వ్యూహంగా క‌నిపిస్తోంది. ఇక‌, కేంద్రం నుంచి కూడా మోడీ అభ‌యం పొందితే.. ఇక తిరుగు లేద‌ని.. కాంగ్రెస్ ఎలానూ లేనప్పుడు.. మోడీతో ప‌నిచేయించుకోవ‌డం.. బెట‌ర్ అని.. చంద్ర‌బాబు భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అందుకే ఆయ‌న రెండేళ్ల ముందు నుంచే బీజేపీతో చెలిమికి రెడీ అవుతున్నార‌నేది విశ్లేష‌కుల అంచ‌నా. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.