Begin typing your search above and press return to search.

చంద్రబాబు చైనా టెక్నాలజీ వాడుతున్నాడా?

By:  Tupaki Desk   |   1 Oct 2020 8:50 AM GMT
చంద్రబాబు చైనా టెక్నాలజీ వాడుతున్నాడా?
X
కొత్త ఒక వింత.. పాత ఒక రోత అంటారు. రాజకీయాల్లో అప్ డేట్ కాకపోతే ఎలా వెనుకబడి పోతామో పోయిన అసెంబ్లీ ఎన్నికల వేళ టీడీపీ అధినేత చంద్రబాబు చవిచూశారు. ఓ వైపు మోడీ, మరో వైపు జగన్ లు సోషల్ మీడియాలో దుమ్మురేపి ఓటర్లను ఆకట్టుకుంటే ఆస్థాయిలో టీడీపీ సోషల్ మీడియా బ్యాచ్ వర్క్ చేయలేదు.. వర్కవుట్ కాలేదన్న అపవాదును మూటగట్టుకున్నారు. అసలు ఐటీని పుట్టించిందే తాను అని చెప్పుకునే చంద్రబాబు ఇలా టెక్నాలజీలో వెనుకబడిపోవడమా? షిట్.. ఇంత కంటే ఘోర అవమానం లేదు. అందుకే బీజేపీ గెలిచిన రాష్ట్రాల్లో టెక్నాలజీని ఎలా వాడారో తెలుసుకునే పనిలో పడ్డారట.. ఈ మేరకు చంద్రబాబు శూలశోధన మొదలుపెట్టారని ఆ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

చంద్రబాబు అంటే హైటెక్ కింగ్.. ఉమ్మడి ఏపీ సీఎంగా హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టి ఐటీ మూలాలు స్థాపించాడు. అలాంటి చంద్రబాబు టెక్నాలజీ వాడడంలో దిట్ట అని అందరూ అంటుంటారు. 2019 ఎన్నికల్లో చతికిల పడిన తరువాత.. టీడీపీ భావి వారసుడు లోకేష్ మీద టీడీపీ శ్రేణుల్లో నమ్మకం కోల్పోయారట.. అందుకే టీడీపీ నుంచి వైసీపీలోకి భారీ ఎత్తున వలసలు వస్తున్నాయి.

అయినా చంద్రబాబు పట్టు వీడకుండా వచ్చే ఎన్నికల్లో ఎలా అయినా గెలవాలని దాని కోసం ఇప్పటి నుంచే మోడీని ఫాలో కావాలని టీడీపీ టెక్నికల్ టీంకు చెప్పాడట.. అందుకే బీజేపీ రాష్ట్రాల్లోకి పోయి బూత్ స్థాయిలో ఎలా మేనేజ్ చేస్తున్నారు? డేటా ఎలా ఎంత ఫాస్ట్ గా ఎలా కలెక్ట్ చేస్తున్నారని.. ఏవీ ఎన్ని కావాలో ఒక టెక్నికల్ టీంను పంపించాడంట..

అయితే చైనా టెక్నాలజీ వాళ్లు చాలా దేశాలకు కూడా రాజకీయంగా టెక్నాలజీని అందిస్తున్నారంట.. అందుకే త్వరలోనే చైనా టెక్నాలజీ కూడా చూద్దాం అని చంద్రబాబు డిసైడ్ అయ్యారట.. నాయకులను నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నామని.. అందుకే టెక్నాలజీని నమ్ముకొని లోకేష్ ను సీఎంను చేయాలని చంద్రబాబు చూస్తున్నాడని టీడీపీ నేతలే వాళ్లలో వాళ్లే గుసగుసలు ఆడుకుంటున్నారు.