Begin typing your search above and press return to search.

మోడీ ముఖం చూడడం కూడా కేసీఆర్ కు ఇష్టం లేదా?

By:  Tupaki Desk   |   12 Nov 2022 4:35 AM GMT
మోడీ ముఖం చూడడం కూడా కేసీఆర్ కు ఇష్టం లేదా?
X
ఏపీలో పర్యటన ముగియగానే తెలంగాణకు ప్రధాని మోడీ వస్తున్నారు. ఈరోజు రామగుండంలో ఎరువుల కర్మాగారంతోపాటు జాతీయ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. తెలంగాణకు వస్తున్న ప్రధానికి ప్రొటోకాల్ ప్రకారం తోడుగా ఉండడం కేసీఆర్ కనీస బాధ్యత కానీ.. మునుగోడు హీట్ తో దండయాత్రకు వచ్చిన బీజేపీని, మోడీని కనీసం చూసేందుకు కూడా కేసీఆర్ ఇష్టపడడం లేదు. ఈ క్రమంలోనే సడెన్ గా కేసీఆర్ ఢిల్లీ వెళ్లడం చర్చనీయాంశమైంది.

రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్తో ముఖ్యమంత్రి శుక్రవారం సాయంత్రం భేటి కావడం చర్చనీయాంశమైంది. బంజారాహిల్స్ లోని సీజే నివాసానికి వెళ్లిన సీఎం కేసీఆర్ ఆయనతో భేటి అయ్యారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సీఎం మర్యాదపూర్వకంగానే భేటి అయినట్టు సీఎంవో తెలిపింది. పలు పరిపాలనపరమైన , ఇతర అంశాలపై ఇరువురూ చర్చించినట్టు సమాచారం. కేసీఆర్ వెంట సీఎస్ సోమేష్ కుమార్ ఉన్నారు.

హైకోర్టు సీజేతో భేటి అనంతరం సీఎం కేసీఆర్ ఢిల్లీకి బయలు దేరి వెళ్లడం చర్చనీయాంశమైంది. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ ఇలా సడెన్ గా ఢిల్లీకి వెళ్లడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

శనివారం తెలంగాణలో మోడీ పర్యటిస్తున్నారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితమిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కేసీఆర్ ను కూడా ఆహ్వానించారు. ఈ సమయంలో ఢిల్లీకి కేసీఆర్ వెళ్లడం రాజకీయ వేడిని మరింత పెంచింది.

మోడీ పర్యటనకు కనీసం ప్రొటోకాల్ పాటించకుండా సీఎం కేసీఆర్ ను కేంద్రం అవమానిస్తోందని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మోడీని ఆహ్వానించామని స్వయంగా కేంద్రమంత్రులు చెబుతున్నారు. లేఖలు బయటపెట్టారు.

టీఆర్ఎస్ నేతల ఆరోపణలను ఖండిస్తున్నారు. ఇక మోడీ పర్యటనకు వ్యతిరేకంగా టీఆర్ఎస్, కమ్యూనిస్టులు నిరసన చేపడుతున్నారు. ఈ క్రమంలోనే మోడీకి తెలంగాణలో నో ఎంట్రీ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. మరి ఈ పర్యటన ఎలాంటి ఉద్రిక్తతలకు దారితీస్తుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.