Begin typing your search above and press return to search.

కేసీఆర్‌కు కొత్త ఇక్క‌ట్లు..!!

By:  Tupaki Desk   |   9 Dec 2022 3:58 AM GMT
కేసీఆర్‌కు కొత్త ఇక్క‌ట్లు..!!
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు కొత్త ఇక్క‌ట్లు ప్రారంభం కానున్నాయా? జాతీయ పార్టీ పెడుతున్నాన న్న సంతోషం ఒక‌వైపు ఆయ‌న‌ను ఉబ్బిత‌బ్బిబ్బ‌య్యేలా చేస్తుంటే.. మ‌రోవైపుకంట్లో న‌లుసులా బీజేపీ దూకుడు పెరుగుతుండ‌డం ఆయ‌న‌కు ఇబ్బందిగా మారింద‌ని అంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో త‌మ‌దే ప్ర‌త్యామ్నాయం అంటూ.. బీజేపీ నాయ‌కులు ప్ర‌క‌టించారు. అయితే, దీనిని కేసీఆర్ తోసిపుచ్చు తూ వ‌చ్చారు.

అంతేకాదు.. జాతీయ స్థాయిలో బీజేపీ ప్ర‌భావం త‌గ్గాల‌ని కూడా కోరుకున్నారు. మోడీపై తీవ్ర‌స్థాయిలో యుద్ధం ప్ర‌క‌టించాల‌ని కూడా త‌ల‌పోశారు. ఈ క్ర‌మంలోనే గుజ‌రాత్ ఎన్నికల ఫ‌లితం కోసం గులాబీ బాస్ ఎదురు చూశారు. ఇక్క‌డ బీజేపీకి తేడా కొడుతుంద‌ని.. అప్పుడు దానిని త‌న‌కుఅనుకూలంగా మార్చుకుని ముందుకు సాగుదామ‌ని అనుకున్నారు. తీరా ఇప్పుడు గుజ‌రాత్ ఎన్నికల ఫ‌లితం వ‌చ్చేసింది.

బీజేపీ దూకుడు పెరిగింది. దీనికి మోడీ మ్యానియాగా ఆ పార్టీ ప్ర‌చారం చేయ‌డంలోనూ స‌క్సెస్ అయింది. సో.. ఈ ప‌రిణామాలు గ‌మ‌నిస్తే.. తెలంగాణ‌లోనూ తాము పుంజుకుంటామ‌ని క‌మ‌ల నాథులు అప్పుడే స్టేట్ మెంట్లు కూడా ఇస్తున్నారు.

దీనిని గ‌మ‌నిస్తే.. కేసీఆర్‌కు బీజేపీని నిలువ‌రించ‌డం.. ముఖ్యంగా మోడీని క‌ట్ట‌డి చేయ‌డం అనుకున్నంత సులువు, ఈజీ అయితే కాద‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

గుజ‌రాత్‌లో ఏమాత్రం తేడా కొట్టినా.. బీజేపీని, మోడీని కేసీఆర్ చెడుగుడు ఆడేసుకునేవార‌న‌డంలో సందే హం లేదు. వ‌చ్చే సార్వ‌త్రిక స‌మ‌రానికి అన్ని ఆయుధాల‌ను రెడీ చేసుకుని పెట్టుకునేవారు. కానీ, ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేకుండా పోయింది.

మోడీ దూకుడు జోరుగా ఉండ‌డంతో కేసీఆర్‌కు మ‌రిన్ని కొత్త‌క‌ష్టాలు త‌ప్పేలా లేవ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. జాతీయ పార్టీగా అవ‌త‌రించి.. బ‌య‌ట‌కు కాలు పెట్టాల‌న్నా. ఇంట్లో బీజేపీ సృష్టించే తుఫాన్‌పై ఆయ‌న దృష్టిని మ‌ళ్లించ‌లేని ప‌రిస్థితి వ‌చ్చింది. ఇదీ.. ప‌రిస్థితి!




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.