Begin typing your search above and press return to search.
డొల్ల కంపెనీలతో చైనా వాళ్ళు మనీల్యాండరింగ్ ?
By: Tupaki Desk | 4 Feb 2022 4:49 AM GMTమనదేశంలో డొల్ల కంపెనీలు పెట్టి చైనా వాళ్ళు మనీల్యాండరింగ్ చేస్తున్నారా ? రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీ (ఆర్వోసీ) వర్గాల ప్రకారం అవుననే సమాధానం వస్తోంది. కొన్ని లావాదేవీలపై అనుమానం వచ్చిన ఆర్వోసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి తీగ లాగితే డొంకంతా కదులుతోంది. ఇప్పటివరకు మనీల్యాండరింగ్ చేస్తున్న 500 చైనా కంపెనీలను గుర్తించారు.
ఈ డొల్ల కంపెనీల్లో చైనా వాళ్ళతో పాటు స్థానికంగా మన వాళ్ళను కూడా కొందరిని డైరెక్టర్లు పెట్టుకుంటున్నారు. ఇలాంటి డొల్ల కంపెనీలు ఏపీలో 4, తెలంగాణలో 12, కర్ణాటకలో 197, తమిళనాడు, మహారాష్ట్రలో కూడా ఉన్నట్లు లెక్క తేలింది. ఏపీలో ఆర్వోసీ అధికారులిచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. దీంతో చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీ అడ్రస్ మాత్రమే కరెక్టని తేలింది. మిగిలిన మూడు కంపెనీల అడ్రస్సులు బోగస్ అని తేలింది. శ్రీ సిటీ లో కూడా అడ్రస్ మాత్రమే కరెక్టని మిగిలిందంతా డొల్ల వ్యవహారమేనట.
ఏవో పేర్లతో కంపెనీలు రిజిస్టర్ చేయటం చైనా నుంచి ముడిసరుకులు తెప్పించుకుంటున్నట్లు ఇన్వాయిస్ లు సృష్టించటం, డబ్బులు చెల్లిస్తున్నట్లు బిల్లులు కూడా సృష్టిస్తున్నారు. అయితే సరుకు రాకుండానే డబ్బులు చెల్లిస్తున్నారు. దీంతో ఇన్వాయిసులు, బిల్లులంతా బోగస్ అని అర్ధమైపోయింది. కేంద్ర కార్పొరేట్ మంత్రిత్వ శాఖ వర్గాల ప్రకారం చైనా మనదేశంలో 500 కంపెనీలు రిజిస్టర్ చేసి మనీ ల్యాండరింగ్ కు పాల్పడుతోందట.
ఇండియా డైరెక్టర్లుగా నియమించుకున్న స్ధానికులకు నెలకు రు. 10 వేలు చెల్లిస్తోంది. స్ధానిక డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్న వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీళ్ళలో ఎవరికి కూడా కంపెనీల కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం లేదని అర్ధమవుతోంది. చైనా వాళ్ళు డొల్ల కంపెనీల ఏర్పాటుకు సహకరించిన కంపెనీ సెక్రటరీలు, చార్టెడ్ అకౌంటెంట్లు, ఆర్వోసీ అధికారులపైన కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. కంపెనీలు రిజిస్టర్ చేసుకుంటున్నట్లు దరఖాస్తుల్లో చెప్పిన అడ్రసులు చాలావరకు బోగస్ అని గుర్తించారు. దర్యాప్తు పూర్తిగా జరిగితే ఇంకెన్ని నిజాలు బయటపడతాయో చూడాలి.