Begin typing your search above and press return to search.
టీఆర్ఎస్ లో ముసలం మొదలవుతోందా..?
By: Tupaki Desk | 13 Nov 2019 2:45 PM GMTఅధికార టీఆర్ఎస్ లో ముసలం మొదలవుతోందా..? ఆర్టీసీ కార్మికుల సమ్మె పై సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాల తో పలువురు మంత్రులు, కీలక నేతలు తీవ్ర అసంతృప్తి తో రగిలిపోతున్నారా..? మరికొద్ది రోజులు ఇలాగే ఉంటే.. తమదారి తాము చూసుకోవాలనే ఆలోచనకు వస్తున్నారా..? అంటే గులాబీ శ్రేణుల్లో వినిపిస్తున్న గుసగుసలు మాత్రం ఔననే అంటున్నాయి. అక్టోబర్ 5వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఈ విషయం లో సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరుపై పలువురు మంత్రులు, కీలక నేతలు తీవ్ర అసంతృప్తి తో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇందు లో ప్రధానం గా 49వేలమంది కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారంటూ కేసీఆర్ ప్రకటించడం పై విస్మయం వ్యక్తం చేసిన ఆ నేతలు.. ఇక ఓపిక పట్టే అవసరం లేదనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది.
తెలంగాణ తెచ్చింది ఉద్యోగాలు ఇచ్చేందుకే తప్ప.. ఇలా ఉన్న ఉద్యోగాలు ఊడ బీకేందుకు కాదని, ఇలా అయితే.. తాము ప్రజల్లో ఎలా తిరగాలి..? అంటూ పలువురు మంత్రులు, నాయకులు అనుచరుల వద్ద లబోదిబోమని మొత్తుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ విషయం లో కేసీఆర్ మొండి పట్టుదలకు పోవడంతో ఎమ్మెల్యేలు, మంత్రులకు ప్రజల్లో ఇబ్బందులు తప్పడం లేదు. ఈ క్రమంలో ముగ్గురు నలుగురు కీలక నేతలు మళ్లీ ధిక్కార స్వరం వినిపించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. రెండో మంత్రివర్గ విస్తరణకు ముందు, ఆ తర్వాత పలువురు కీలక నేతలు గులాబీ బాస్‌పై ధిక్కార స్వరం వినిపించిన విషయం తెలిసిందే. మంత్రి ఈటల రాజేందర్, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, మాజీ మంత్రి నాయిని నరసింహా రెడ్డి తో పాటు పలువురు ధిక్కార స్వరం వినిపించారు.
ప్రస్తుతం ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయం లో ఇటు అన్నివర్గాల ప్రజలు ఉద్యమిస్తున్నా, అటు హైకోర్టు మందలిస్తున్నా కేసీఆర్ స్పందించక పోవడంతో పలువురు నేతల ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సొంతగూటి లో ధిక్కార స్వరం వినిపిస్తేనే.. కేసీఆర్ దిగివస్తారని, ఆర్టీసీ కార్మికుల కు న్యాయం జరగాలంటే.. ఇదే సరైన మార్గమమని చర్చించుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే, పిల్లి మెడ లో గంట ఎవరు ?కడుతారనే దగ్గరే కొంత సతమతం అవుతున్నట్లు తెలుస్తోంది. ఎవరో ఒకరు ధైర్యం చేస్తే.. మిగతా వారుకూడా కలిసి వస్తారని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గులాబీ గూటి లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చుననే టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి పరిణామాలు ఎలా ఉంటాయో..!