Begin typing your search above and press return to search.

జగన్ సభకు రావాలంటే.. బ్లాక్ అన్న మాటే కనిపించకూడదట!?

By:  Tupaki Desk   |   22 Nov 2022 6:02 AM GMT
జగన్ సభకు రావాలంటే.. బ్లాక్ అన్న మాటే కనిపించకూడదట!?
X
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నారంటే ప్రజలకు ఇబ్బందికరంగా మారుతోందా? ఆయన పాల్గొనే బహిరంగ సభకు వెళ్లే మహిలకు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. ప్రతిపక్షాలు ఇలానే ఆరోపిస్తున్నారు ఏకంగా ఒక టీవీ ఛానల్ పెద్ద డిబేట్ పెట్టింది దీని మీద.

ఏదైనా కార్యక్రమంలో పాల్గొనేందుకు బయటకు వచ్చే ముఖ్యమంత్రికి ఇసుమంత ఇబ్బంది కూడా కలగకుండా ఉండేందుకు బోలెడన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసులు. జగన్ సీఎం అయ్యాక.. ఆయన ఏదైనా ఊరికి వెళితే.. అక్కడ ముందస్తుగా షాపులు మూసేయటంతో పాటు బోలెడన్ని ఆంక్షల్ని అమలు చేస్తున్నారు పోలీసులు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా నరసాపురంలో సీఎం జగన్ నిర్వహించిన సభకు హాజరైన మహిళల విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు ఇప్పుడు షాకింగ్ గా మారింది. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్లాక్ డ్రెస్ వేసుకున్న వారిని సభకు అనుమతించేది లేదని చెబుతున్నారు. అంతేకాదు.. బ్లాక్ చున్నీలు వేసుకొచ్చిన మహిళల నుంచి వారి చున్నీలు తీసుకొని వేరే చోట ఉంచి.. తిరిగి వెళ్లే టప్పుడు తీసుకోవాలని పోలీసులు చెప్పటం చర్చనీయాంశంగా మారింది అని అంటున్నాయి ప్రతిపక్షాలు

నలుపు నిరసనకు ప్రతిరూపంగా వాడతారన్నది తెలిసిందే. అయితే.. నిరసనకు నలుపు రంగును వాడతారన్నది తెలిసిందే. అంత మాత్రాన బ్లాక్ డ్రెస్ వేసుకుంటేనే నిరసన తెలిపినట్లు కాదు కదా? కానీ..

అలాంటి అవకాశాన్ని ఇవ్వకూడదన్నట్లుగా పోలీసుల తీరు ఉండటం గమనార్హం. ఇక.. జగన్ వచ్చిన సందర్భంగా సభను నిర్వహించిన చుట్టుపక్కల ప్రాంతాల్లో తోపుడు బండ్ల నుంచి వ్యాపార సంస్థల్ని కూడా మూసి ఉంచటం గమనార్హం. ఇదంతా చూస్తే.. నలుపు మీద ఏపీ పోలీసులకు ఎందుకంత అత్యుత్సాహం అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.