Begin typing your search above and press return to search.

మంత్రుల వ‌ల్ల‌.. సీఎం జ‌గ‌న్ ఇబ్బంది ప‌డుతున్నాడా?

By:  Tupaki Desk   |   19 April 2021 3:30 AM GMT
మంత్రుల వ‌ల్ల‌.. సీఎం జ‌గ‌న్ ఇబ్బంది ప‌డుతున్నాడా?
X
ఏపీలో అప్ర‌తిహ‌త మెజారిటీతో అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌.. త‌న పాల‌న ‌ను దేశం మొత్తం త‌ల‌తిప్పి చూడాల‌ని అనుకున్నారో.. ఏమో.. 2019లో అధికారంలోకి రాగానే.. ఆయ‌న త‌న మంత్రి వ‌ర్గ కూర్పులో అనేక జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. రాష్ట్రంలో జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే.. `రెడ్డి రాజ్యం` వ‌స్తుంద‌ని ప్ర‌చారం చేసిన వారికి షాకిస్తూ.. త‌న కేబినెట్‌లో సోష‌ల్ ఇంజ‌నీరింగ్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. అంటే.. సామాజిక వ‌ర్గాల కూర్పులో అత్యంత జాగ్ర‌త్త‌లు పాటించారు.

ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్ త‌న మంత్రివ‌ర్గంలో కొత్త ఎమ్మెల్యేల‌కు సైతం అవ‌కాశం క‌ల్పించారు. అయితే.. ఈ ప‌రిణామం.. మేలు చేయ‌క‌పోగా.. ఇప్పుడు సీఎం జ‌గ‌న్‌కు ఇబ్బందిగా ప‌రిణ‌మించింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. చాలా వ‌ర‌కు జిల్లాల్లో ఎంతో సీనియ‌ర్ ఎమ్మెల్యేలు ఉన్నారు. దాదాపు నాలుగు నుంచి ఐదు సార్లుగా ఎమ్మెల్యే అయిన వారు క‌నిపిస్తున్నారు. కానీ, ఇదే జిల్లాలో తొలిసారి ఎమ్మెల్యే అయిన నాయ‌కుడికి.. మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. ఈ క్ర‌మంలో ఇప్పుడు సీనియ‌ర్ ఎమ్మెల్యేలు ఏ ప‌నిచేయించుకోవాల‌ని అనుకున్నా.. జూనియ‌ర్ అయిన‌.. ఎమ్మెల్యే క‌మ్ మంత్రి చుట్టూ తిర‌గాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.

దీంతో సీనియ‌ర్లు.. తీవ్ర ఇబ్బంది ప‌డుతున్నారు. ఇక‌, మంత్రులుగా ఉన్న కొత్త‌వారు సైతం.. బెట్టు చేస్తు న్నారు. మాకు సీఎం అండ ఉంది. అనే ధీమా వీరిలో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని తెలుస్తోంది. దీంతో సీనియర్ ఎమ్మెల్యేల‌కు.. మంత్రుల‌కు మ‌ధ్య క‌లుపుగోలు త‌నం స‌న్న‌గిల్లింద‌ని అంటున్నారు. ఈ ప‌రిణామంతో ప్ర‌తి జిల్లాలోనూ మంత్రుల‌కు, ఎమ్మెల్యేల‌కు మ‌ధ్య ఢీ అంటే.. ఢీ అనేలా ప‌రిస్థితి ఉంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుత ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. కొన్ని కొన్ని జిల్లాల్లో అయితే.. సీనియ‌ర్ ఎమ్మెల్యేల‌కు క‌నీసం మండ‌ల స్థాయి అధికారులు కూడా స్పందించ‌డం లేదు.

దీనికి కూడా మ‌రో రీజ‌న్ క‌నిపిస్తోంది. సీనియ‌ర్ ఎమ్మెల్యేలు పేరుకే సీనియ‌ర్లుగా ఉన్నార‌ని.. వారు చెబితే.. క‌నీసం.. ట్రాన్స్ ఫ‌ర్లు కూడా కావ‌డం లేద‌ని అధికారులు సైతం ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు. దీంతో సీనియ‌ర్ ఎమ్మెల్యేలు.. తీవ్ర తిప్ప‌లు ప‌డుతున్న మాట వాస్త‌వం. అయితే.. ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు లేవు. పైగా అధికారం వ‌చ్చి ఇంకా ఏళ్లు కూడా కాలేదు. దీనికి తోడు మ‌రో ఆరు మాసాల్లో.. కొత్త మంత్రులు వ‌స్తారు. అప్పుడు చూద్దాం అని సీనియ‌ర్ ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు.

ఇదిలావుంటే.. సీనియ‌ర్ ఎమ్మెల్యేల‌కు ముఖ్య‌మంత్రి నుంచి క‌నీసం అప్పాయింట్ మెంట్ కూడా దొర‌క్క పోవ‌డం వారిని మ‌రింత బాధ పెడుతోంది. కానీ, ఈ విష‌యాల‌ను వేటినీ.. ముఖ్య‌మంత్రి ప‌ట్టించుకోవడం లేదు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. నేరుగా ఆయ‌న ప్ర‌జ‌ల‌తోనే సంబంధాలు పెట్టుకోవ‌డం. రాబోయే ఎన్నిక‌ల్లో ముఖ్య‌మంత్రి టు.. సాధార‌ణ ప్ర‌జ‌లు అనే విధంగా ఉంటుంద‌ని.. ఈ ఈక్వేష‌న్ మేర‌కే జ‌గ‌న్ ప‌నిచేసుకు పోతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఏం జ‌రుగుతుందో చూడాలి.