Begin typing your search above and press return to search.
థర్టీ ఇయర్స్ పృథ్వీ జాక్ పాట్.. ఆ కీలక పదవి?
By: Tupaki Desk | 13 July 2019 8:29 AM GMTటాలీవుడ్ నటుడు పృథ్వీ జాక్ పాట్ కొట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా పని చేసిన పృథ్వీకి జగన్ ప్రభుత్వం గట్టి బహుమామే ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. శ్రీవెంకటేశ్వర భక్తి చానల్ చైర్మన్ పదవిని పృథ్వీకి ఇవ్వనుందట ఏపీ ప్రభుత్వం.
ఈ మేరకు ప్రచారం జరుగుతూ ఉంది. త్వరలోనే ఇందుకు సంబంధించి ఉత్తర్వులు రాబోతూ ఉన్నాయట. గత ప్రభుత్వ హయాంలో దర్శకుడు రాఘవేంద్ర రావు ఎస్వీబీసీ చైర్మన్ గా వ్యవహరించారు. రాఘవేంద్రరావు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడు అనే సంగతి తెలిసిందే. అలా ఆయనకు ఆ పదవి దక్కింది.
టీడీపీ ప్రభుత్వం పడిపోగానే రాఘవేంద్రరావు ఆ పదవికి రాజీనామా చేసి తప్పుకున్నాడు. టీటీడీ చైర్మన్ నియామకం ఇప్పటికే పూర్తి అయ్యింది. ఇక టీటీడీ కమిటీ సభ్యులు, ఎస్వీబీసీ చైర్మన్ తదితర పోస్టుల భర్తీ మాత్రం పెండింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో పార్టీకి హార్డ్ కోర్ సపోర్టర్ గా నిలిచిన పృథ్వీకి ఎస్వీబీసీ చైర్మన్ పదవి దక్కనుందని వార్తలు వస్తున్నాయి.
అదే దక్కదితే పృథ్వి కష్టానికి ప్రతిఫలం దక్కినట్టే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో కూడా పృథ్వి పాల్గొన్నాడు. చిత్రసీమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికేందుకు సినీ జనాలు పెద్దగా ముందుకు రాకపోయినా పృథ్వీ మాత్రం గట్టిగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడాడు.