Begin typing your search above and press return to search.
సహకార ఎన్నికలకు ముందే కాంగ్రెస్ ఓటమి?
By: Tupaki Desk | 12 Feb 2020 8:30 PM GMTతెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరీ తీసికట్టుగా తయారవుతోందన్న ఆవేదన క్షేత్ర స్థాయి నేతల్లో వ్యక్తమవుతోంది.. రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా కారు పార్టీ జెట్ స్పీడుతో దూసుకు పోతోంది. తెలంగాణ ఇచ్చామని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ మాత్రం వరుస ఓటములతో ఢీలా పడుతోంది. అసెంబ్లీ, పార్లమెంట్, పంచాయతీ, మున్సిపల్.. ఇలా ఏ ఎన్నిక తీసుకున్నా కాంగ్రెస్ టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చిన దాఖలాలు లేవు. జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ రోజురోజుకు దిగజారిపోతూ ఓ గల్లీ పార్టీ తరహాలో కన్పిస్తుంది. మొన్నటి మొన్న పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు చూస్తే సొంతంగా ఇండిపెండెంట్లు గెలిచినన్నీ స్థానాలను కూడా గెలుచుకోలేదంటూ రాష్ట్రం లో కాంగ్రెస్ పరిస్థితి ని అర్థం చేసుకోవచ్చు.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అప్రతిహతంగా రెండోసారి విజయ ఢంకా మోగింది. ఆ తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ రాష్ట్రంలో అంతంత మాత్రంగా ఉన్న బీజేపీ నాలుగు ఎంపీ సీట్లను గెలుచుకోగా కాంగ్రెస్ మాత్రం మూడు సీట్లకే పరిమితమైంది. ఇక పంచాయతీ, కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి కనీస పోటీ ఇవ్వలేదు. అక్కడక్కడ సొంత ఇమేజ్ ఉన్న నేతలు గెలిచారు తప్పా పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలు పని చేయలేదు. పార్టీల్లో ఉన్న గ్రూపులు, సమన్వయం లోపం ప్రతీ ఎన్నికల్లో కొట్టొచ్చినట్లు కన్పిస్తుంది.
వరుస ఓటములతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలంటే భయ పడుతోంది. తాజాగా సహకార ఎన్నికల్లోనూ అదే నిస్సత్తువ ఆవహించింది.. దీనిపై పార్టీ అధిష్టానం ఏమాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఏదో మొక్కుబడి గా గాంధీ భవన్లో మీటింగ్ పెట్టి మమా అనిపించారు. పార్టీ వరుస ఓటములకు కారణాలేంటో కూడా నేతలు విశ్లేషించుకోవడం లేదు.
ఇంతకముందు గెలిచిన స్థానాలను తిరిగి నిలబెట్టుకోవాలన్న తాపత్రయం నేతల్లో కరువైంది. అయితే కొందరు నేతలు మాత్రం పార్టీ నాయకత్వం మార్పు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళుతున్నాయి. అయితే అధిష్టానం మాత్రం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. పార్టీ నాయకత్వం మార్పు కంటే నేతల్లో సమన్వయ లోపం వల్లే పార్టీకి ఎక్కువ నష్టం జరుగుతుందని కార్యకర్తలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
అయితే పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ పార్లమెంట్ సమావేశాలతో బీజీగా ఉండటం వల్లనే సహకార ఎన్నికలపై దృష్టిపెట్టలేదని పలువురు చెబుతున్నారు. అయితే సహకార ఎన్నికల దృష్ట్యా పార్టీ గెలిచేందుకు ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేసుకోవడం లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ సహకార ఎన్నికలకు ముందే చేతులెత్తేసినట్లు కన్పిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో నేతల తీరు ఇలానే కొనసాగితే మాత్రం భవిష్యత్ లో తీవ్ర నష్టం జరుగుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.