Begin typing your search above and press return to search.

కోదండరాం పోటీ చేయబోతున్నాడా? లేదా? క్లారిటీ ఇదే

By:  Tupaki Desk   |   5 Oct 2020 3:30 PM GMT
కోదండరాం పోటీ చేయబోతున్నాడా? లేదా? క్లారిటీ ఇదే
X
పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో ప్రొఫెసర్ కోదండరాం పోటీపై ఉత్కంఠ వీడింది. నల్లగొండ-వరంగల్-ఖమ్మం అభ్యర్థిగా ప్రొఫెసర్ కోదండరాం పోటీ చేస్తున్నారని తెలంగాణ జనసమితి (టీజేఎస్) వెల్లడించింది. ఈ మేరకు పార్టీ ఉపాధ్యక్షుడు విశ్వేశ్వరరావు మీడియాకు ప్రకటన విడుదల చేశారు.

అయితే మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీ కోదండరాంకు మద్దతు ఇస్తుందా? లేదా అభ్యర్థిని బరిలోకి దింపుతుందా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. పట్టభద్రుల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి కోదండరాంకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలుస్తుందనే వార్తలు వెలువడ్డాయి.

అయితే జిల్లా స్థాయి నేతలు మాత్రం పార్టీ కోసం పనిచేసిన వారిలో నుంచి బలమైన వ్యక్తిని ఎన్నికల్లో పోటీకి దింపాలని టీపీసీసీ అగ్రనేతలకు సూచించారు.

మరోవైపు వరంగల్ -ఖమ్మం-నల్గొండ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరాంకి మద్దతుపై కోర్ కమిటీలో చర్చించామని.. దాని సూచన మేరకు తుది నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ ఏఐసీసీ ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ వెల్లడించారు.

మరోవైపు కాంగ్రెస్ నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి వరంగల్ నుంచి ఆరుగురు పోటీ పడుతున్నట్టు తెలిసింది. ఈ మేరకు వారంతా టీపీసీసీకి దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.