Begin typing your search above and press return to search.
దీపావళి టపాసుల కు.. కొవిడ్ ముప్పు పెరగటానికి లింకేంటి?
By: Tupaki Desk | 3 Nov 2021 4:51 AM GMTప్రపంచం లో ఎవరి పండుగలకు లేని అభ్యంతరాలు.. పర్యావరణ హితవచనాలు హిందువులు జరుపుకునే పండుగల వేళ లోనే ఎందుకు ప్రచారం జరుగుతుందన్న ప్రశ్న అంత కంత కూ ఎక్కువ అవుతోంది. అందుకు తగ్గట్లే మీడియా లో వస్తున్న వార్తల పైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అలాంటి వార్తను ఒక ప్రముఖ మీడియా సంస్థ అచ్చేయటం పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికి కొవిడ్ ముప్పు పొంచి ఉందని.. ప్రస్తుతం చలికాలం మొదలైన వేళ.. దీపావళి సందర్భం గా కాల్చే బాణ సంచా తో వాయు కాలుష్యం భారీ గా పెరుగుతుందని.. దీంతో కొవిడ్ వ్యాప్తి కావటాని కి కారణమవుతుందన్న కొత్త వాదనను తెర మీదకు తీసుకొచ్చారు.
సాధారణ సమయాల్లో కంటే కాలుష్యం లో వైరస్ అతి వేగం గా వ్యాప్తి చెందుతుందన్న సిద్ధాంతాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. అధికారిక లెక్కల ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ బారిన పడినోళ్లు.. కోలుకున్నోళ్ల మధ్య అంతరం భారీ గా తగ్గి పోయింది. కోలుకున్న వారి లో ఒక ట్రెండు శాతం మందిని దీర్ఘకాలిక సమస్యలు వేధిస్తున్నాయి. దీనికి కారణం.. కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయం లో జాగ్రత్త గా ఉండక పోవటం ఒక కారణం. అయితే.. ఈ విషయాన్ని హైలెట్ చేయకుండా.. పండుగ ను ముడి పెట్టటం పైన విమర్శలు వెల్లువెత్తున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో తాజాగా ఉప ఎన్నిక ముగిసింది. ఎన్నికల ప్రచారం వేళ చేసిన హడావుడి.. నిర్వహించిన ర్యాలీ రాష్ట్రం మొత్తం మీద లేవు. కానీ.. ఒక అసెంబ్లీ నియోజకవర్గం లో జరిగిన ఈ ప్రచారం వేళ.. దాన్నో యూనిట్ గా తీసుకుంటే.. ఇప్పటికి ఆయా ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి భారీ గా ఉండాలి కదా? లేదంటే.. వైరస్ వ్యాప్తి పెరిగిపోయి ఉండాలి కదా? అలాంటి దేమీ లేదు. అంత దాకా ఎందుకు రాజకీయ నేతలు భారీ బహిరంగ సభల్ని నిర్వహిస్తున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకో కుండా వేలాది గా రోడ్ల మీదకు వస్తున్నారు. ఇలాంటి వేళ లోనూ వైరస్ వ్యాప్తి అధికం గా ఉండాలి కదా? అలాంటిదేమీ లేని వేళ.. దీపావళి సందర్భం గా కాల్చే టపాసుల తో ఇబ్బంది ఎక్కువ గా ఉంటుందని హెచ్చరించటం ఏమిటన్న విమర్శ వినిపిస్తోంది.
అయితే.. ఒక విషయాన్ని మాత్రం ఒప్పుకోవాలి. సాధారణ పరిస్థితుల తో పోల్చినప్పుడు దీపావళి రోజున కాల్చే టపాసుల కారణం గా.. గాలిలో వివిధ రసాయనాలు భారీ గా ఉండటం.. శ్వాసకోశ సమస్యల్ని ఎదుర్కొనే వారికి ఇబ్బందికరం గా మారటం మాత్రం ఒప్పుకోవాలి. దీని కి పరిష్కారం గా ఆ రోజు రాత్రి వేళ.. అందరూ టపాసులు కాల్చే సమయం లో ఇంట్లో తలుపుల్ని మూసుకొని కూర్చుంటే.. అలాంటి వారి సమస్యకు పరిష్కారం ఉంటుంది.
కానీ.. అందుకు భిన్నం గా సాధారణ సమయం తో పోలిస్తే.. టపాసులు కాల్చటం వల్ల వెలువడే పొగ తో గాలి స్తంభిస్తుందని.. కాలుష్యాల కారణం గా విడుదలయ్యే అతిసూక్ష్మ ధూళికణాలు గాలి లో తేలుతుందని చెబుతున్నారు. దీని కారణం గా కరోనా వైరస్ అతుక్కు పోయి.. మనం గాలి పీల్చుకున్నప్పుడు శ్వాసకోశాల్లో కి చేరి పోతుందని.. వైరస్ శరీరం లోకి మరింత గా చొచ్చుకు పోవటానికి కాలుష్యం ఒక వాహకం గా వాడుకుంటుందని చెప్పేవాళ్ల కు.. ముఖానికి మాస్కు పెట్టుకుంటే సమస్యకు పరిష్కారం ఉంటుందన్న మాటను మాత్రం ప్రస్తావించకపోవటాన్ని తప్పు పడుతున్నారు.
ఎందుకిలా అంటే.. టైమ్లీ సంచలనం గా దీన్ని చెప్పాలి. పండుగ వేళ.. అందరూ టపాసులు కాల్చే వేళ లో.. ఇలా కొవిడ్ భయంతో వార్తను అందరూ చదివేలా చేయటం కోసం పడుతున్న ప్రయాస గా పలువురు మండిపడుతున్నారు. సామూహిక ప్రార్థనలు.. కొన్ని పండుగుల వేళ లో నిర్వహించే భారీ ఊరేగింపులు.. గంటల తర బడి సాగే ఉత్సవాల తో వైరస్ వ్యాప్తి చెందదా? అని ప్రశ్నిస్తున్నారు. అందు కే.. సీజనల్ అంశాల్ని ప్రస్తావిస్తూ.. అందు లో భయాన్ని రంగరించే తీరును తప్పు పడుతున్నారు.
నిజాని కి చలికాలం లో వైరస్ వ్యాప్తి చెందుతుంది.. ఎండా కాలం లో వ్యాప్తి చెందదన్న ప్రచారం ఎంత తప్పన్న విషయం కొవిడ్ సెకండ్ వేవ్ సందర్భం గా తేలి పోయింది. సెకండ్ వేవ్ తీవ్రత మొత్తం నడి వేసవి అయిన ‘మే’లో విరుచుకుపడిందన్న విషయాన్ని మర్చి పోకూడదు. అలా అని హెచ్చరికలు పట్టనట్లు కాకుండా.. కాస్త ఆచి తూచి అన్నట్లు గా వ్యవహరించటం తప్పేం కాదు. జాగ్రత్త గా ఉండాలి.. అదే సమయం లో అనవసర భయాల్ని వెంట ఉంచు కోవటం మంచిది కాదన్నదే మా ఉద్దేశం. అందుకే ఈ విషయాన్ని మేం చెప్పదలుచుకున్నాం.