Begin typing your search above and press return to search.
క్రిప్టో కరెన్సీ చెలమణి భారత్ లో అంత ఈజీ కాదా?
By: Tupaki Desk | 14 Nov 2021 6:09 AM GMTప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది కొత్తకొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. కరెన్సీ చెలమణిలోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. ఆధునిక యుగంలో నాణెలు, కాగితం(డబ్బు) రూపంలో కన్పించిన కరెన్సీ ఇప్పుడు డిజిటల్ రూపంలోకి మారింది. డబ్బుల చెలమణి మొత్తం కూడా డిజిటల్ పేమెంట్స్ రూపంలోనే జరుగుతున్నాయి. కరోనా ఎంట్రీ తర్వాత ఈ కల్చర్ భారత్ లోనూ ఎక్కువగానే కన్పిపిస్తోంది. దీనిలో కొంత రిస్కు ఉన్నప్పటికీ ట్రాన్సక్షన్స్ ఈజీగా జరుగుతుండటంతో ఎక్కువ మంది వీటి వైపే మొగ్గుచూపుతున్నారు.
డిజిటల్ మనీ లాగే క్రిప్టో కరెన్సీ కూడా ప్రస్తుతం హల్చల్ చేస్తోంది. చాలా దేశాల్లో క్రిప్టో కరెన్సీ ఇప్పటికే చెలమణి అవుతోంది. దీంతో చాలా మంది ఇన్వెస్టర్లు క్రిప్టో కరెన్సీ వైపు చూస్తున్నారు. ఇందులో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని ప్రకటనలు ఇటీవలీ కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా కన్పిస్తున్నాయి. దీంతో చాలామంది ఈ ప్రకటనలకు ఆకర్షితులై వాటిలో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఇవన్నీ కూడా అవాస్తవమని నిపుణులు హెచ్చరిస్తుండటం ఆందోళనను కలిగిస్తోంది.
ఇలాంటి సమయంలో భారత్ లో క్రిప్టో కరెన్సీ భవితవ్యంపై ప్రధాని మోదీ తాజాగా ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించడం ఆసక్తిని రేపుతోంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ సహాయంతో అభివృద్ధి చెందుతున్న క్రిప్టో కరెన్సీని అన్నివిధలా పరిశీలించిన తర్వాతే తగు నిర్ణయం తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఈ విషయంలో క్రిప్టో కరెన్సీ నిపుణులు, అన్ని వాటాదారుల నిర్ణయాలని పరిగణలోకి తీసుకొని తగు నిర్ణయం తీసుకుంటామని కేంద్రం సంకేతాలను పంపుతోంది.
క్రిప్టో కర్సెన్సీపై ప్రభుత్వ నియంత్రణ లేనందునా మనీ ల్యాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్ కు అవకాశం ఉంటుందని కేంద్రం భావిస్తోంది. అదేవిధంగా క్రిప్టో కరెన్సీ వల్ల దేశ సూక్ష్మ ఆర్థిక, ద్రవ్య సుస్థిరతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆర్బీఐ సైతం హెచ్చరిస్తోంది. దీంతో కేంద్రం క్రిప్టో కరెన్సీ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ లో క్రిప్టో కరెన్సీ చెలామణి అనేది మాత్రం సవాళ్లతో కూడుకున్న విషయమేనని ఆర్థిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రాబోయే రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.