Begin typing your search above and press return to search.
ప్రధానిని దారుణంగా తిట్టేసి భావ ప్రకటనా స్వేచ్ఛ అంటారా? ఆ హైకోర్టు ఆగ్రహం!
By: Tupaki Desk | 19 July 2022 4:14 AM GMTముందు వెనుకా చూసుకోకుండా.. పెద్దా చిన్న అన్న తారతమ్యం లేకుండా మనసుకు తోచినట్లు.. నోటికి వచ్చినట్లుగా తిట్టేయటం.. సోషల్ మీడియాలో షేర్ చేయటం ఈ మధ్యన ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. అదేమంటే.. వాక్ స్వాతంత్య్రం.. భావ ప్రకటనా స్వేచ్ఛ అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడే వారికి సరైన రీతిలో క్వశ్చన్ చేసింది అలహాబాద్ హైకోర్టు. తాజాగా ఫేస్ బుక్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఉద్దేశించి అభ్యంతరకర రీతిలో వ్యాఖ్యలు చేయటంతో పాటు.. 'కుక్క' లాంటి దారుణ పదాలతో పోస్టు పెట్టిన ముంతాజ్ మన్సూరీపై గుజరాత్ పోలీసులు కేసు నమోదు చేశారు.
దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ముంతాజ్.. అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ప్రాథమిక హక్కుగా ఉన్న వాక్ స్వాతంత్య్రం.. భావ ప్రకటనా స్వేచ్ఛలను ప్రస్తావిస్తూ.. ఆ పరిధిలోనే తాను వ్యాఖ్యలు చేసినట్లుగా సమర్థించుకునే ప్రయత్నం చేశారు.
దీనిపై స్పందించిన అలహాబాద్ హైకోర్టు.. ఈ ప్రాథమిక హక్కులకు సహేతుకమైన పరిమితులు ఉన్నాయని స్పష్టం చేసింది. అదే సమయంలో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలన్న విన్నపాన్ని తోసి పుచ్చింది. దీంతో.. అతనిపై ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు పోలీసులు.
భారత ప్రభుత్వంలోని ప్రధానమంత్రి.. కేంద్ర మంత్రుల్ని.. ముఖ్యమైన వ్యక్తుల్ని దూషించే వారికి వాక్ స్వాతంత్య్రం వర్తించదన్న హైకోర్టు.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్ పై హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అశ్వనీ కుమార్ మిశ్రా.. జస్టిస్ రాజేంద్ర కుమార్ లతో కూడిన డివిజన్ బెంచ్ విచారణను చేపట్టి.. తమ ద్రష్టికి వచ్చిన అంశాలపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది.
కేసు విచారణలో భాగంగా.. తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలన్న పిటిషనర్ వాదనను తోసిపుచ్చుతూ.. అతడిపై విచారణ యోగ్యమైన నేరం కింద అభియోగాలు మోపారని పేర్కొంది.
ఈ ఉదంతంలో చట్టబద్ధంగా ముందుకు వెళ్లాలని పోలీసులకు సూచన చేసింది. ప్రధానమంత్రిని.. ఇతర కేంద్ర మంత్రుల్ని ఉద్దేశిస్తూ 'కుక్క' లాంటి అభ్యంతరకర వ్యాఖ్యలతో పెట్టిన పోస్టుపై ఐపీసీ సెక్షన్ 504తో పాటు ఐటీ చట్టంలోని సెక్షన్ 67 కింద కేసు నమోదు చేశారు. తాజాగా అలహాబాద్ హైకోర్టు డివిజన బెంచ్ చేసిన ఈ వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా చెలరేగిపోయే వారికి ఒక హెచ్చరికకగా చెప్పక తప్పదు.