Begin typing your search above and press return to search.

దావూద్‌ చ‌నిపోయిన‌ట్లు చెబుతోన్న పాక్ మీడియా!

By:  Tupaki Desk   |   30 April 2017 4:40 AM GMT
దావూద్‌ చ‌నిపోయిన‌ట్లు చెబుతోన్న పాక్ మీడియా!
X
మోస్ట్ వాంటెడ్ క్రిమిన‌ల్‌.. 1993 నాటి ముంబ‌యి బాంబు పేలుళ్ల ఘ‌ట‌న‌లో అమాయ‌కులైన 257 మంది మృతికి కార‌ణంతో పాటు.. అండ‌ర్ వ‌ర‌ల్డ్ కార్య‌క‌లాపాల‌తో భార‌త్ కు స‌వాల్‌ గా మారిన దావూద్ ఇబ్ర‌హీం తుదిశ్వాస వీడాడా? అన్న‌ది బిగ్ క్వ‌శ్చ‌న్ గా మారింది. 61 ఏళ్ల దావూద్ తీవ్ర‌మైన గుండెపోటుతో మ‌ర‌ణించిన‌ట్లుగా పాకిస్తాన్ మీడియా సంస్థ‌లు కొన్ని వార్త‌లుగా అచ్చేస్తున్నాయి. ఇటీవ‌ల తీవ్ర‌మైన గుండెపోటుతో ఆసుప‌త్రిలో చేర్చిన‌ట్లుగా చెప్పిన సంగ‌తి తెలిసిందే.

నిజానికి ఆసుప‌త్రికి దావూద్ చేరిన విష‌యంలోనే కాస్తంత క‌న్ఫ్యూజ్ ఉంది. ఆయ‌న‌కు గుండెపోటు అని కొంద‌రు.. కాదు బ్రెయిన్ ట్యూమ‌ర్ కార‌ణంగా తీవ్ర అస్వ‌స్థ‌త కార‌ణంగా ఆయ‌న ఆసుప‌త్రి చేర‌గా.. ఆయ‌న‌కు ట్యూమ‌ర్ తొల‌గించేందుకు శ‌స్త్ర‌చికిత్స జ‌ర‌ప‌టం.. ఆప‌రేష‌న్ ఫెయిల్ అయిన‌ట్లుగా చెబుతున్నారు. ఇదే దావూద్ మ‌ర‌ణానికి కార‌ణంగా చెబుతున్నారు.

అయితే.. ఈ వార్త‌లేవీ నిజం కాద‌ని.. భాయికి ఏం కాలేద‌ని.. ఆయ‌న ఆరోగ్యంగా.. క్షేమంగా ఉన్న‌ట్లుగా ఆయ‌న ప్ర‌ధాన అనుచ‌రుడు ఛోటా ష‌కీల్ చెబుతున్నారు. దావూద్ పూర్తిగా ఆరోగ్యంతో ఉన్న‌ట్లుగా ష‌కీల్ ఒక టీవీ ఛాన‌ల్ తో చెప్పారు.ముంబ‌యి పేలుళ్ల కేసులో నిందితుడైన దావూద్ కొన్నేళ్లుగా పాక్ లో త‌ల‌దాచుకోవ‌టం.. ఆయ‌న ఆచూకీ కోసం భార‌త్ ప్ర‌య‌త్నించ‌టం.. అత‌గాడు త‌మ ద‌గ్గ‌ర లేనేలేడంటూ పాక్ బుకాయించ‌టం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ నెల 19న దావూద్ చివ‌రిసారి త‌న అల్లుడి ఇంట్లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో కనిపించిన‌ట్లుగా చెబుతున్నారు. ఏమైనా దావూద్ చ‌నిపోయాడా? బ‌తికి ఉన్నాడా? అన్న విష‌యం మీద భారీ క‌న్ఫ్యూజ‌న్ నెల‌కొంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇప్ప‌టివ‌ర‌కూ అందిన స‌మాచారం ప్ర‌కారం చూస్తే.. దావూద్ మ‌ర‌ణించి ఉండే అవ‌కాశాలుత‌క్కువ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఒక‌వేళ ఆయ‌న కానీ చ‌నిపోయి ఉంటే.. ఇప్ప‌టికే ఆ స‌మాచారం బ‌య‌ట‌కు వ‌చ్చేద‌ని.. ఇంత గుట్టుగా ఉంచే అవ‌కాశం ఉండ‌దంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/