Begin typing your search above and press return to search.

చంద్రబాబు బ్రోకర్ దేవినేని ఉమానా !

By:  Tupaki Desk   |   22 Nov 2019 9:33 AM GMT
చంద్రబాబు బ్రోకర్ దేవినేని ఉమానా !
X
ఏపీలో రాజకీయం అట్టుడుకుతోంది. పార్టీల పరంగా విమర్శలు మని , వ్యక్తిగతంగా విమర్శించడం మొదలుపెట్టారు. గత కొన్ని రోజులుగా టీడీపీ , వైసీపీ నేతల మధ్య విమర్శల పర్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీ మంత్రి కోడలి నాని ..చంద్రబాబు , లోకేష్ పై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఈ తరుణంలోనే టీటీడీ పై కూడా కొన్ని విమర్శలు చేసారు. నాని టీటీడీ పై చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే రాష్ట్రంలో నూతన మద్యం పాలసీతో విపరీతంగా పెరిగాయని దేవినేని ఉమా మాట్లాడారు.

ఇక ఉమా వ్యాఖ్యలపై మరోసారి మంత్రి నాని గట్టిగా ఏసుకున్నాడు. చంద్రబాబు బ్రోకర్ దేవినేని ఉమా అంటూ నిప్పులు చెరిగారు. ఎన్టీఆర్ నాడు మద్యపాన నిషేధాన్ని పెడితే పనికిమాలిన దద్దమ్మ అయిన చంద్రబాబు నాయుడు దాన్ని తీసివేసి రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా మార్చాడని నిప్పులు చెరిగారు. ఇదే క్రమంలో దేవినేని ఉమా చంద్రబాబు బ్రోకర్, చంద్రబాబును వాడు వీడు అంటూ పరుష పదజాలంతో దూషించారు. వదినను పదవి కోసం చంపిన ఉమా, మంత్రిగా ఉన్నప్పుడు బ్రోకర్ పనులు చేశాడని, కమీషన్లు తీసుకెళ్లి పప్పు నాయుడుకి, వాడి బాబుకి ఇచ్చాడని అన్నారు.

పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపించినట్లు కమీషన్లు తీసుకున్న ఉమా కు అందరూ కమీషన్లు తీసుకున్నట్లు కనిపిస్తోందని ఘాటుగా బదులిచ్చారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ని ఎక్కువగా వాడుకుంది కొడాలి నాని, వల్లభనేని వంశీ అన్న వ్యాఖ్యల పై స్పందిస్తూ ... తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ పేరును, ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల పేరును వాడుకోని నాయకులు ఎవరైనా ఉంటే వారి పేర్లు చెప్పాలని సవాల్ విసిరారు మంత్రి నాని. దీనిపై దేవినేని ఉమా ఏ విధంగా రియాక్ట్ అవుతారో మరి.