Begin typing your search above and press return to search.

తమిళనాట బీజేపీ వల్లే డీఎంకే విజయమా?

By:  Tupaki Desk   |   5 April 2021 10:00 AM GMT
తమిళనాట బీజేపీ వల్లే డీఎంకే విజయమా?
X
తమిళనాడులో రేపే ఎన్నికలు జరుగనున్నాయి. ఈసారి తమిళనాట అటు జయలలిత, ఇటు కరుణానిధి లాంటి దిగ్గజాలు లేకుండా ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజలు అధికార అన్నాడీఎంకేను ఆదరిస్తారా? ప్రతిపక్ష డీఎంకే అధినేత స్టాలిన్ ను సీఎం చేస్తారా? అన్నది ఉత్కంఠగా మారింది.

అయితే తమిళనాట డీఎంకేకు ఏకపక్షంగా మద్దతు ఇవ్వడానికి గెలిపించడానికి అన్నాడీఎంకేతో జట్టు కట్టి బీజేపీనే కారణమన్న ప్రచారం సాగుతోంది.తమిళనాడులో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆ పార్టీతో జట్టుకట్టిన అన్నాడీఎంకేకు ఓట్లు వేసే పరిస్థితి లేదు. అయినా కేంద్రంలో అధికారంలో ఉండడంతో శశికళను రాజకీయ సన్యాసం చేయించి.. అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకొని మరీ బీజేపీ పంతంగా తమిళనాట పోటీపడుతోంది.

ఇక ప్రజల్లో మోడీ, షాలపై వ్యతిరేక బాగా ఉండడంతో డీఎంకే ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది. వారిని విలన్లుగా చూపింది. ఇదే సమయంలో మోడీ, అమిత్ షాలు కూడా అర్థం చేసుకోకుండా తిరగడం అన్నాడీఎంకేకు మైనస్ గా మారింది.

ఇక మోడీషాలకు చెప్పేంత ధైర్యం అన్నాడీఎంకేకు లేకపోవడంతో వారు కూడా జరగాల్సిన నష్టాన్ని కళ్లారా చూశారు. సోషల్ మీడియాలో మోడీషాలు తమిళనాడు వచ్చినప్పుడల్లా గో బ్యాక్ మోడీ.. అమిత్ షాలు ట్రెండింగ్ లో నిలిచాయి.

ఇక ఈ పరిణామాలకు మూడు నాలుగురోజుల ముందు స్టాలిన్ కుమార్తె ఇంటిపై ఐటీ దాడులు చేయడం కలకలం రేపింది. ఇది డీఎంకేపై ప్రజల్లో సానుభూతికి కారణమైంది. దీంతో బీజేపీపై మరింత ఆగ్రహం తమిళుల్లో ప్రారంభమైంది. బీజేపీ నేతల వల్లే డీఎంకే విజయం సాధ్యమవుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రేపు జరిగే ఎన్నికల్లో తమిళనాట స్టాలిన్ పార్టీ విజయం ఖాయమంటున్నారు.