Begin typing your search above and press return to search.
బీజేపీ కి హెల్ప్ చేసిన రాష్ట్రపతి!
By: Tupaki Desk | 8 Dec 2022 11:30 AM GMTరాజకీయాల్లో వ్యూహాలు వేయడం ఒక ఎత్తయితే.. సదరు వ్యూహాన్ని ఎన్నికల్లో ఓటు బ్యాంకుగా మార్చుకోవ డం మరో ఎత్తుగడ. ఈ విషయంలో బీజేపీ సంపూర్ణంగా విజయం దక్కించుకుంది. గుజరాత్ ఎన్నికలకు ముందు, దేశంలో రాష్ట్రపతి ఎన్నికలు వచ్చాయి. అప్పటి వరకు రాష్ట్రపతిగా ఉన్న రామ్‌నాథ్ కోవింద్ ను కొనసాగిస్తారని అందరూ అనుకున్నారు. కానీ, అనూహ్యంగా బీజేపీ వ్యూహం మార్చింది.
రామ్‌నాథ్ పట్ల సానుభూతి ఉన్నప్పటికీ.. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో కీలకమైన నిర్ణయం తీసుకుంది. గుజరాత్‌లో ఎస్టీ సామాజిక వర్గానికి 30 సీట్లు ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు కాంగ్రెస్ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది.
కాంగ్రెస్‌ను దెబ్బకొట్టాలంటే.. ఈ సీట్లు మెజారిటీగా కౌవసం చేసుకుని తీరాలని కంకణం కట్టుకున్న బీజేపీ ఆదిశగానే అడుగులు వేసింది. ఈ క్రమంలోనే ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ద్రౌపది ముర్మును రాష్ట్రపతి పీఠం పై కూర్చోబెట్టింది.
అయితే, ఇక్కడితో కథ అయిపోలేదు. గుజరాత్‌లోని సౌరాష్ట్రలో ఉన్న 26 ఎస్టీ నియోజకవర్గాల్లో ఎటు చూసినా.. ఎవరి నోట విన్నా.. ద్రౌపది ముర్ము కథే వినిపించేలా. కనిపించేలా బీజేపీ నాయకులు వ్యూహాలు పన్నారు.
అనుకున్నట్టుగానే చేశారు. ప్రధాని మోడీ నుంచి హోం మంత్రి అమిత్ షా వరకు.. ద్రౌపది ఫొటోను వాడుకున్నారు. ఎస్టీలను తాము ఎంత సమున్నత పీఠంపై కూర్చోబెట్టామో.. చూడండంటూ.. ఎస్టీల మనసులు దోచుకున్నారు.
దీంతో గత 2017 ఎన్నికల్లో ఒక్క సౌరాష్ట్రలోని 26 స్థానాల్లో కాంగ్రెస్ 20 చోట్ల పాగావేసి, బీజేపీ కేవలం 6 స్థానాలు దక్కించుకోగా.. తాజా ఎన్నికల్లో బీజేపీ 25 చోట్ల దిగ్విజయ ప్రభంజనాన్ని సృష్టించింది. ఫలితంగా కాంగ్రెస్ స్థానాలు బదాబదలయ్యాయి. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. గతంలో కాంగ్రెస్ కూడా కేఆర్ నారాయణన్‌ను రాష్ట్రపతిని చేసింది. ఆయన కేరళ వాసి. ఎస్సీ. అయినా.. ఓటు బ్యాంకుగా వినియోగించుకోలేదు. కానీ, బీజేపీ హద్దులు చెరిపేసింది. కాదేదీ ఓట్లకనర్హం అని ప్రకటించుకుని సక్సెస్‌సాధించింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.