Begin typing your search above and press return to search.
ఎలోన్ మస్క్ ‘వైన్’ను తీసుకరాబోతున్నారా?
By: Tupaki Desk | 2 Nov 2022 12:30 AM GMTప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ దిగ్గజ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయిన ట్విట్టర్ ను ఇటీవల కొనుగోలు చేసి సంచలనం సృష్టించారు. ఈ క్రమంలోనే ట్విటర్లో తన మార్క్ ప్రక్షాళన చేపడుతూ ట్రెండింగ్ లో నిలుస్తున్నారు. ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్.. లీగల్ పాలసీ ట్రస్ట్ సేఫ్టీ హెడ్ విజయ గద్దె.. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగల్ లతోపాటు 9 మంది డైరెక్టర్లపై వేటు వేశారు.
అంతేకాకుండా పలువురు ఉద్యోగులను సైతం ఇంటికి పంపించే యత్నం చేస్తున్నారని సమాచారం. దీంతోపాటు ట్విటర్లో పేయిడ్ సర్వీస్ ను ప్రారంభించబోతున్నట్లు ఎలోన్ మాస్క్ ఇటీవల ప్రకటించారు.
దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఇదిలా ఉంటే ఎలోన్ మాస్క్ తన ట్విటర్లో ఓ ఆసక్తికరమైన సర్వే నిర్వహించగా నెటిజన్ల నుంచి అనుహ్యమైన స్పందన వచ్చింది.
అక్టోబర్ 31న ఎలోన్ మస్క్ తన ట్విటర్లో వినియోగదారులు వైన్ ను తిరిగి పొందాలని అనుకుంటున్నారా? అనే పోల్ నిర్వహించారు. ‘బ్రింగ్ బ్యాక్ టు వైన్’ పేరిట నిర్వహించగా ఈ సర్వేలో 49 లక్షల 20 వేల 155 మంది నెటిజన్లు పాల్గొని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇందులో 69.6 శాతం వైన్ కు అనుకూలంగా.. 30.4శాతం మంది వ్యతిరేకంగా ఓటేశారు.
వైన్ అనేది ఒక షార్ట్ ఫార్మ్ వీడియో సర్వీస్. ఆరు సెకన్ల నిడివి గల వీడియోలను షేర్ చేయాలనే ఆలోచన నుంచి వైన్ యాప్ సృష్టించబడింది. 2012లోనే వైన్ యాప్ సర్వీస్ అందుబాటులోకి రాగానే ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. ఈ క్రమంలోనే ట్వీట్టర్ దీనిని కొనుగోలు చేసింది. అయితే 2016 సంవత్సరంలోనే దీనిని మూసివేశారు.
కాగా ప్రస్తుతం టిక్ టాక్.. ఇన్ స్టా గ్రామ్ లు వీడియో షేరింగ్ సర్వీసులో దూసుకెళ్తున్నాయి. ఇలాంటి తరుణంలో ట్విట్టర్ మరోసారి వైన్ సర్వీసును తీసుకరావాలని ప్రయత్నిస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ట్విట్టర్ వినియోగదారులు సైతం ‘వైన్’ సర్వీసు కావాలని మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో ఎలోన్ మస్క్ ఈ సర్వీసును ఎలాంటి మార్పులతో తీసుకొస్తారనేది ఆసక్తిని రేపుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.