Begin typing your search above and press return to search.
ఓదార్పు యాత్ర వద్దన్న సోనియా ఫ్యామిలీకి చివరకు తప్పలేదే?
By: Tupaki Desk | 13 Oct 2021 5:31 AM GMTకాల మహిమ కాకుంటే ఏమనాలి? దేన్నైతే వ్యతిరేకిస్తామో దాన్నే ఫాలో కావాల్సి ఉంటుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి కాంగ్రెస్ అధినాయకత్వానికే ఎదురు కావటం.. ఏకంగా సోనియమ్మ కుటుంబానికి రాజకీయ అస్త్రంగా మారటం ఆసక్తికర అంశంగా చెప్పక తప్పదు. కొన్నేళ్ల క్రితం తన తండ్రి మరణంతో వేదన చెందిన పలువురు ఆత్మహత్యలు చేసుకోవటం.. ఆ కుటుంబాల్ని పరామర్శించేందుకు వీలుగా అప్పటి కాంగ్రెస్ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేయాలని నిర్ణయించారు. కాంగ్రెస్ పార్టీలో ఇలా అనుకుంటే అలా జరగటానికి వీల్లేదన్న విషయం తెలిసిందే.
పార్టీ అధిష్ఠానం ఒకటి ఉండటం.. దానికో ప్రోటోకాల్ ఉండటం తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి చేపడతానని చెప్పిన ఓదార్పు యాత్రకు అధిష్ఠానం నో చెప్పటం తెలిసిందే. యాత్ర చేసే బదులు.. బాధితులు అందరిని ఒక కల్యాణ మండపానికి పిలపించి ఉమ్మడిగా ఓదార్పు చేపట్టాలన్న సూచన చేయటం.. వారి వాదనతో విభేదించిన జగన్.. తన దారిన తాను వెళ్లేందుకు సిద్ధం కావటం.. సొంత పార్టీ పెట్టుకోవటం తెలిసిందే.
కట్ చేస్తే.. అప్పట్లో జగన్ చేస్తానన్న ఓదార్పు యాత్రకు నో చెప్పేసిన కాంగ్రెస్ కు తాజాగా ఇప్పుడు అదే ఓదార్పు యాత్ర ఆయుధంగా మారింది. యూపీలో ఆందోళన చేస్తున్న రైతులపైకి కేంద్రమంత్రి కుమారుడు తన వాహనంతో తొక్కేసుకు వెళ్లటం.. ఈ సందర్భంగా పలువురు మరణించిన వైనం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహాన్ని.. ఆందోళనను వ్యక్తం చేస్తున్న ప్రియాంక వాద్రా.. బాధితుల కుటుంబాల్ని పరామర్శించటానికి ప్రయత్నించటం.. అందుకు నో చెప్పిన పోలీసులు అడ్డుకోవటం తెలిసిందే. పట్టువదలకుండా చివరకు తాను అనుకున్నది సాధించిన ప్రియాంక.. బాధిత కుటుంబాలను స్వయంగా వెళ్లి పరామర్శిస్తున్నారు.
ఇదంతా చూసినప్పుడు.. ఒకప్పుడు ఏ ఓదార్పు యాత్రకు నో చెప్పారో.. ఇప్పుడు అదే తరహా యాత్ర తప్పనిసరిగా మారటమే కాదు.. పార్టీ ఫేట్ మారుస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా లఖీమ్ పూర్ ఖేరీ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు అంతిమ ప్రార్థనలు జరిపేందుకు టికోనియా గ్రామంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి రైతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రియాంక గాంధీతో పాటు.. పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. మొత్తంగా గాంధీ కుటుంబానికి ‘ఓదార్పు యాత్ర’ ఇప్పుడో అస్త్రంగా మారటం గమనార్హం.