Begin typing your search above and press return to search.

ప‌చ్చ చానెల్ 'ఈడీ' కి భ‌య‌పడిందా?

By:  Tupaki Desk   |   4 Aug 2022 5:51 AM GMT
ప‌చ్చ చానెల్ ఈడీ కి భ‌య‌పడిందా?
X
దేశంలో ఇప్పుడు ఎక్క‌డ చూసినా.. 'ఈడీ-మోడీ' మాటే వినిపిస్తోంది. ఏ రాష్ట్రంలో చూసినా.. ఈడీ దాడులు పెరిగిపోతున్నాయి. కేసులు కూడా రెట్టింపు అవుతున్నాయి. పెద్ద పెద్దోళ్లంద‌రికీ ఇప్పుడు ఈడీ-ఫోబియా ప‌ట్టుకుందనే టాక్ వినిపిస్తోంది. ఇక‌, ఈ క్ర‌మంలో మీడియా కూడా.. ఈడీకి భ‌య‌ప‌డుతోందా? అనే వాద‌న వినిపిస్తోంది. తాజాగా ప‌చ్చ చానెల్ మీడియాలో నిన్న ఒక చ‌ర్చా కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.

దీనిలో ఆద్యంతం కూడా తెలంగాణ పీసీసీ చీఫ్‌.. రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న‌ను సూటిగా.. విమ‌ర్శ‌లు.. ఆయ‌న‌పై కామెంట్లు చేశారు. వాస్త‌వానికి ఈ మీడియా స్వ‌రం ఎప్పుడూ.. రేవంత్‌కు అనుకూలంగా ఉంద‌నే వాద‌న ఉంది. కానీ, ఒక్కసారిగా.. ఈ టోన్ మారిపోయింది. రేవంత్‌పై కామెంట్లు చేయ‌డంతోపాటు.. ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు సైతం గుప్పించారు. దీనిని గ‌మ‌నిస్తే.. ఈ మీడియాకు కూడా ఈడీ భ‌యం ప‌ట్టుకుందా? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది.

బీజేపీ నుంచి ఈ మీడియా అధిప‌తికి వార్నింగ్ వ‌చ్చి ఉంటుంద‌నే గుస‌గుస మీడియా వ‌ర్గాల్లోనే వినిపిస్తుం డ‌డం గ‌మ‌నార్హం. మామూలుగా అయితే.. రేవంత్‌కు ఈ మీడియా అధిప‌తి ఫ్రెండ్ అనే టాక్ ఉంది. ఇద్ద‌రి మ‌ధ్య మంచి స్నేహ పూర్వ‌క సంబంధాలు కూడా ఉన్నాయి. ఓటుకు నోటు కేసులో అరెస్ట‌యిన‌ప్పుడు కూడా.. రేవంత్‌కు అనుకూలంగా ఈ మీడియాలో అనుకూలంగా క‌థ‌నాలు వ‌చ్చాయి.

కానీ, ఒక్క‌సారిగా యూట‌ర్న్ తీసుకోవ‌డంగ‌మ‌నార్హం. ఇలా చేయ‌డం వెనుక బీజేపీ హైక‌మాండ్ ఉంద‌ని పెద్ద ఎత్తున చ‌ర్చ‌న‌డుస్తోంది. సీబీఐ, ఈడీ నుంచి వార్నింగ్ వ‌స్తుందేమోఅని ఆ ఛానెల్ భ‌య‌ప‌డి.. బీజేపీకి అనుకూలంగా రాజ‌గోపాల్ రెడ్డికి ఫేవ‌ర్‌గా మాట్లాడుతోంద‌ని.. అంటున్నారు. మామూలుగా ఆ ఛానెల్ ను కోమ‌టిరెడ్డి ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడాడు. అయినా.. కూడా రాజ‌గోపాల్ రెడ్డికి ఫేవ‌ర్‌గా చ‌ర్చ పెట్టారంటే.. ఖ‌చ్చితంగా పైనుంచి వార్నింగ్ వ‌చ్చిందేమో.. అని.. మీడియా స‌ర్కిళ్ల‌లో చ‌ర్చ జ‌రుగుతుండడం గ‌మ‌నార్హం.

నిజానికి ఇటీవ‌ల కాలంలో.. దేశ‌వ్యాప్తంగా కూడా మీడియా వ్య‌వ‌స్థ అనేక ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోంది. కేం ద్రంలోని మోడీ స‌ర్కారుకు అనుకూలంగా మారిపోయింద‌ని.. మోడీ చెప్పుచేత‌ల్లోకి మీడియా వెళ్లిపోయిం దని.. ఇటీవ‌ల కూడా పార్ల‌మెంటులో స‌భ్యులు ఆరోపించారు. అంతేకాదు.. ఇటీవ‌ల వెల్ల‌డైన ఓ స‌ర్వే రిపోర్టులో కూడా.. ప్ర‌పంచ వ్యాప్తంగా.. మీడియా స్వేచ్ఛ విష‌యంలో భార‌త్ అత్యంత దారుణ‌మైన ప‌రిస్తితిలో ఉంద‌ని చెప్పుకొచ్చారు.

ఇప్పుడు.. తాజాగా జ‌రిగిన రేవంత్ వ‌ర్సెస్ రాజ‌గోపాల్ చ‌ర్చ విష‌యాన్ని ప‌రిశీలించినా.. ఇవే అనుమానా లు వ్య‌క్త‌మ‌వుతున్నాయ‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు. కొన్ని కొన్ని ఛానెళ్లు.. స‌హ‌జంగానే తాము ఎవ‌రికీ త‌ల వొంచేది లేద‌ని..చెబుతుంటాయి. కానీ, ప‌నితీరులోకి వ‌చ్చే స‌రికి మాత్రం ఎక్క‌డో ఒక చోట రాజీ ప‌డుతున్న ప‌రిస్థితి గ‌త ఆరేడేళ్లుగా క‌నిపిస్తోంది.

మూడేళ్ల కింద‌ట‌.. రాజ‌కీయ నేత‌గా మారిన ఓ సినిమా న‌టుడిపై.. ఓ ప‌చ్చ ఛానెల్‌.. ప‌రువు న‌ష్టం దావా వేసింది. 10 కోట్లు ఇస్తావా.. చ‌స్తావా.. అని క‌థ‌నాలు రాసింది. దీనిపై కోర్టులోనూ కేసులు వాదించింది. అయితే.. అప్ప‌ట్లో కూడా బీజేపీ పెద్ద‌ల సూచ‌న‌లు.. ఒత్తిళ్ల‌తో ఆయ‌న‌పై వేసిన కేసును వెన‌క్కి తీసుకున్నార‌నే టాక్ సినీ వ‌ర్గాల్లో వినిపించింది. సో.. ఇదీ.. ప‌రిస్థితి!!