Begin typing your search above and press return to search.
హరీశ్.. ఎందుకింత అవస్థ..!
By: Tupaki Desk | 17 Oct 2018 4:05 AM GMTతాజాగా ఒక ఫోటో వైరల్ అవుతోంది. మంగళవారం రాత్రి ఎన్నికల మేనిఫెస్టో వివరాల్ని వెల్లడించేందుకు టీఆర్ఎస్ అధినేత.. తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయటం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన పార్టీకి చెందిన ముఖ్యనేతలంతా వేదిక మీద కూర్చున్నారు.
రెండు వరుసల్లో వేదిక మీద నేతలు ఉండగా.. వారి మధ్యన కూర్చున్న కేసీఆర్.. వన్ మ్యాన్ షోను నడిపారు. ఎప్పటిలానే కేసీఆర్ మీడియా సమావేశం వన్ సైడెడ్ గా.. ఎవరూ పరిమితికి మించి ప్రశ్నలు వేసేందుకు అనుమతించలేదు. తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పటం.. తాను తిట్టాలనుకున్న వారిని తిట్టేయటంతో మీడియా సమావేశాన్ని ముగించేశారు.
అయితే.. ఈ సమావేశం సందర్భంగా కూర్చున్న నాయకుల విషయం ఇప్పుడు అందరి నోట చర్చగా మారింది. కేసీఆర్ మేనల్లుడు కమ్ పార్టీలో కీలకమైన స్థానంలో ఉన్న హరీశ్ కుర్చీ.. మొదటి వరుస చివర్లో ఉండటం ఆసక్తికరంగా మారింది. ఇటీవల కాలంలో హరీశ్ ను కేసీఆర్ నమ్మటం మానేశారని.. ఆయన్ను పూర్తిగా పక్కన పెట్టారని.. ఈ విషయంపై హరీశ్ తీవ్ర మనస్తాపంతో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి.
హరీశ్ వర్గీయులకు చెక్ పెట్టేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని.. గతంలో మాదిరి సరైన టర్మ్స్ లేవంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే.. అవన్నీ అవాస్తవాలని.. తాను పార్టీలో కంఫర్ట్ గా ఉన్నట్లు హరీశ్ బయటకు చెబుతున్నా.. లోలోన మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయన్న మాటే ఎక్కువగా వినిపిస్తోంది.
పార్టీలో హరీశ్ ను తొక్కేస్తున్నారన్న ప్రచారం అంతకంతకూ పెరిగి.. చివరకు కేటీఆర్ కు ఇబ్బందికరంగా మారటంతో.. ఆయన హరీశ్ ను పొగడటం.. ఇద్దరూ ఒకే వేదిక మీదకు రావటం ఈ మధ్యన జరిగింది. ఆ విషయాన్ని కాసేపు పక్కన పెడితే.. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్ ను ఒక వరుసచివరన కూర్చోబెట్టటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కీలక సమావేశంలో వరుస చివర్లో కూర్చోబెట్టటం అంటే..పార్టీలో హరీశ్ స్థానాన్ని కేసీఆర్ చెప్పకనే చెప్పారన్న విమర్శ పలువురి నోట వినిపిస్తోంది. అయితే.. దీనికి కౌంటర్ గా మరో మాట కూడా వినిపిస్తోంది.బహిరంగ వేదికల మీద ఎప్పుడూ హరీశ్.. కేటీఆర్ లకు పెద్దగా ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కేసీఆర్ వ్యవహరించరని.. తాజా మీడియా సమావేశంలోకేటీఆర్ లేరన్న విషయాన్ని మర్చిపోకూడదని గుర్తు చేస్తున్నారు. మొత్తంగా చూస్తే.. మీడియా సమావేశంలో హరీశ్ నుకూర్చోబెట్టిన స్థానంపైన మాత్రం ఆసక్తికర చర్చ సాగుతుందని చెప్పక తప్పదు.